పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : విదర్భరాజు తనకుమార్తె రుక్మిణిని శిశుపాలున కిచ్చుటకుఁ దీర్మానించుట

రూఢయౌవన నాయింతి జనకుఁ 
డేరాజు తనయన కిత్తు నేననుచుఁ
జింతించి చైద్యుండు శిశుపాలుఁ డర్హుఁ
డింతికి నని నిశ్చయించి పెండ్లికిని
లదిక్పాలుర కలభూపతుల
లమహీశ్వరమితి రప్పించి
ధీయుక్తిమై నాఱు దినములలోన
నాతంబగు లగ్నరుదెంచుటయును
నం నారుక్మిణి యంతయు నెఱిఁగి