పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : ఉషాకన్య విరహము

లలోని సేఁత నిక్కముగాఁగ దలఁచి
ళవలపడు మేను రుపార నిలుచు; 
దిక్కులు పరికింపుఁ దెలిసియారూప
మెక్కడ బొడగాన కెంతయు వగచి;     790 
కొలఁదినై ప్రహ్లాదకులపయోరాసి
“కలఁపగాఁబుట్టిన ట్టడినైతి; 
మని యెఱిఁగింతు నీముటలొరుల
కేమిగాఁగలదకో; టమీఁద” ననుచుఁ
లఁగుఁ జేట్పాటున డు చిన్నబోవు; 
లుకనేరక డిల్లడు; మారుమాటఁ
బొరిపొరి నాలించుఁ బువ్వుపాన్పునను
బొరలు గ్రమ్మఱ నిద్రవోచూచు లేచు; 
లుఁగెత్తి యిందురావే యని పిలుచు; 
లుపులోనున్న యాని రమ్యమూర్తిఁ
లపోయుఁ దలయూఁచుఁ న్నుఁదా మఱచు; 
లరాజు చెలిమికి వంతలోఁగుందుఁ
జెక్కునఁ జెయిఁజేర్చి చింతించునంత
నెక్కొన్నఁదగ వేఁడి నిట్లూర్పు వుచ్చు; 
నొగలు; హాయనుచుఁ గన్నుల నీరునించు; 
మొగమెత్తకంగుటంబున నేల వ్రాయు; 
పులకించు; చమరించుఁ బొరిమూర్ఛఁబోవు; 
లుగు; నాతని యొప్పు నంతంత పొగడు; 
పొరి కాముఁడాడించు బొమ్మచందమునఁ
రవశయై పంచ బాణాగ్నిశిఖల     800 
గ్గమై యందంద యాఱడిపొందు; 
దిగ్ధనలేచి భీతిల్లి శ(య్య)వ్రాలు; 
గోరికెలాతనిఁ గోరి రేకెత్తఁ
గూరుకుఁ గానక కొందలమందు. 
ఈ భంగి మదనాగ్ని నెరియుచునున్న
నాభామచెలియ కుంభాండునిపుత్రి
చిత్రరేఖనుపేరఁ జెన్నారు లేమ
మైత్రి వాటించి యమ్మగువకిట్లనియె.