పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : సత్రాజిత్తుని వృత్తాంతము

అంత సత్రాజిత్తుఁను రాజవృషభుఁ
డెంయు భయమంది యిందిరావిభుని
కాస్యమంతకముతో మృతాంశుమండ
లాస్యక నిచ్చెదని చెప్పుటయును
వెఱఁగొంది యారాజు “వెన్నునికేల
వెచి యమ్మణితోన వెలఁది నెట్లిచ్చె
నాథఁ జెప్పవే”ని వేఁడ శుకుఁడు 
ప్రాటంబుగఁ గురుప్రవరుతో ననియె. 
“అఘ! సత్రాజిత్తుఁను ధరాధీశుఁ
డినుగూర్చి తపమాచరింప నాతనికి
మెచ్చి వరంబిచ్చె మిహిరుఁడు వేఁడ
నిచ్చె స్యమంతాఖ్య నెసఁగు రత్నంబు
నాణి వక్షంబునందొప్పఁ దాల్చి
తారసాప్తుఁడితండకో! యనఁగ.      340
ణి యేలుచునుండి ద్వారకాపురికి
రుదెంచి యొకనాఁడు రిఁజూచు వేడ్క
“ససిజసఖుఁడేల నుదెంచె!” ననుచుఁ
బుమువారెల్ల నద్భుతమంది చూడ
శౌరిగేహమునకుఁ నుదేర, కృష్ణుఁ
డారాజు మన్నించి ర్థిఁ బూజించి
యొక కొన్ని నెలలుండి యొక్కనాఁడతని