పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : రుక్మి కృష్ణుని తూలనాడుచుఁ గవియుట

అంకుమును విదర్బాదీశతనయుఁ
డంకసముఁడు క్రోధాత్ముఁడై రుక్మి
సేనతోడ ముంఱ నేఁగి కృష్ణుఁ
నుఁగొని భీషణోగ్రస్ఫూర్తిఁ బలికె, 
“ఓరి! గోపాధమా! డక నన్నుఁ
జీరికిఁగొనక నాచెలియలిఁ బట్టి
కొనిపోయెదికఁ నెందుఁ గొనిపోయెదీవు? 
నిను నాశరంబుల నీరుఁ గావింతు; “
ని గుణధ్వనిసేసి యాఱుబాణములుఁ
నువునఁ గీలింప దానవాంతకుఁడు
ల్లన నవ్వుచు తని కేతనము
విల్లును ద్రుంచిన వేరొక్క ధనువుఁ
గొని బాణవర్షంబుఁ గురియఁగ శౌరి
కినిసి తేజుల సూతుఁ గీటణఁగించి
నువుఁ ద్రుంచుటయు, నాతఁడు వమ్మువోక
మైన ఖేటకడ్గంబుఁ గొనుచు.      220
రితేరిపైకి రయంబునఁ గదిసి
వాలమున వ్రేయఁ మలాక్షుఁడతని
లుకయువాలును బాణాష్టకమనఁ
దృమాత్రమునఁ ద్రుంచి ధృతిమూర్చవుచ్చి