పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : రుక్మిణి శిశుపాలాదులు వచ్చుట విని హరిరాకకై పరితపించుట

లఁగి మ్రాన్పడి నిల్చు, ళవళంబందుఁ 
బెలుకుఱులోఁ దాఱు పెదవులుఁ దడపుఁ
లుక కూరకనుండుఁ లుమాటలాడు
నిలువనేరక వ్రాలు నిట్టూర్పు వుచ్చు
నంతయు హరిఁ జేర్చు నంతరంగమున
సంతాపమొదవంగఁ ర్చించి చూచు; 
క్కట! యెక్కడి రిగెనో! విప్రుఁ
డెక్కడఁ బోయనో! లకోతడసె! 
రికి యిక్కడివార్తలందెనో! నడుమ
దిరిగెనో! శౌరిఁ దోతెచ్చుచున్నాఁడొ! 
ఈ కార్య మెఱిఁగింప నిందిరావిభుఁడు
కైకొనకుండునో! డువేడ్కతోడ
చ్చునో! ఎవ్వరే లదందురొక్కొ! 
నెడమకన్నును జన్ను నెడమభుజంబు
డి నదరెడి హరిచ్చు నిశ్చయము.” 
ని యిచ్చనూహింప నంబుజోదరుఁడు
నుదెంచి సీరితో సైన్యంబుతోడ
నాపురోద్యానంబు నందొప్ప విడిసి
భూపాలతనయకింపుగఁ దనరాకఁ      80
జెప్పి వుత్తెంచినఁ జెన్నార విప్రుఁ
ప్పొలంతుకఁ గాంచి రివచ్చెననుడు
రుషాశ్రువులు గ్రమ్మ నందంద మేను
రుపార నవ్విప్రుఁ ని యిట్టులనియె, 
“పురుషార్థపరుఁడవు పుణ్యచిత్తుడఁవు
రమాప్తుఁడవు నాకుఁ బ్రాణంబు నీవ! 
ప్రాణవల్లభుఁడైనఁ ద్మాక్షుఁ దెచ్చి 
ప్రాణంబుఁ గాచితి లుకులిం కేల!“
నిపల్కి యతనికి నందంద మ్రొక్కి
నకాంబరములిచ్చి నతతో ననిచె.