పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : రుక్మిణీదేవి సౌధవర్ణనము

భంగి నొకనాఁడు యిందిరావిభుఁడు
సౌభాగ్య రుక్మిణీ దనంబులోనఁ
జూట్టు వైడూర్య సోపానములును
నేపార నీలాల నెనయు నరుంగుఁ
సిఁడి కంభంబుల ట్టపుసాల
మాన బహుదీప్తి డుకు వుత్తళులు
కత రుచిఁబోల్చు దురులనొప్పు
సిరిమాఱు గచ్చు సేసిన కుడ్యములును
మొప్పు నవచంద్రకాంతజలములు
రిదంతముల నవకంబైన తలుపు
డంపు గడపలు సిఁడి బోదెలును
నిగిడిన వజ్రాల నెగడిన గడియ
మేలైన కెంబట్టు మేల్కట్టు మెఱయు
నాల వట్టంబును డపసంబెళయుఁ
స్తూరి గంధ మంళ ధూపములును
స్తమై తగు మల్లసాలలు నొప్పె.