పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : పినాకి కృష్ణునితోఁబోరాడుట

రిఁ దాఁకె బహుపిశాచావళితోడ 
యాదవవీరులు సురవీరులును
నాదటఁ బోరాడ తిభీషణముగఁ     950
మలాక్షుసేనలగ్గలికమై తరుమఁ 
బ్రమథసేనలు భూతలమును దిరిగి
డలు వీడఁగ మేను ళుకంద కాళ్లు
డవడ వణఁకంగ వాతెరలెండఁ
బెదవులు దడవుచు భీతిఁ బెల్లుఱికి
దవద పఱచె నారుఁడున్న కడకు; 
ఱతెంచు సేనల ర్గుఁడు జూచి
వెఱవకుండని నిల్పి వృషభంబునెక్కె; 
రుడ వాహన యక్షణములకంత
రభసంబున మహాసంగ్రామమయ్యె; 
దిక్కులొక్కట మ్రోసె దిగిభంగులొరలె; 
చుక్క లెల్లడరాలె సురకోటి వెఱచె; 
బ్రహ్మాదిసంయమిప్రతతి భీతిల్లె; 
బ్రహ్మాండభాండంబు గిలినట్లయ్యె! 
రుఁడు పినాకమునందేనుశరము
లురుముష్టి సంధించి యురమాడనేయ
రిశార్ఙ నిర్ముక్తగు శరాష్టకము
రుమీఁద వెననేసి యార్చిన గినిసి
పాశుపతాస్త్రంబుఁ శుపతి వ్రేయ
నాశౌరి యేసె నారాయణాస్త్రంబు.     960 
రువుర శరములు నెలమి నొండొండఁ
రుషమై రవికోటి డినచందమున
డాయచుఁ బేర్చి మంలు మింటనంట 
మ్రోయుచు రెండస్త్రములు శాంతమయ్యె. 
బ్రహ్మాస్త్రమడరింపఁబంకజోదరుఁడు. 
బ్రహ్మాస్త్రమున శాంతఱచె నాహరుఁడు. 
రూఢగతి హరుఁనలాస్త్రమేయ
వారుణాస్త్రంబున వారించె శౌరి. 
లద బాణమునఁ బాషాణవర్షంబు
లగొని యడరింపగాఁ గృష్ణుఁ డలిగి
యురగ బాణంబేయ నురక మురారి
రుడాస్త్రమున దాని ఖండించివైచె. 
వారణోజ్వలబాణహనసత్వమున
నారుద్రుఁడడరింప ద్రులఁ బగిది
దారుణంబుగ మత్తదంతులు గవియ
నారసింహాస్త్ర మున్నతిఁ బ్రయోగించి
ఘోరకంఠీరవ కోటులచేతఁ
గోరి యాకరికోటిఁ గూల్చెనాశౌరి. 
అంతట హరుఁడు కాలాంతకమూర్తి
యెంతయు హరిఁజూచి యెసఁగు రోషమున     970 
దాపజ్వరంబు నుద్ధతిఁ గూర్చి యేయ
నేపార నదిసేన నెరియింపఁ జొచ్చె. 
ష్ణజ్వరమువచ్చు నురువడిఁజూచి
వైష్ణవాస్త్రముఁదొడ్గి వారిజోదరుఁడు