పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : పౌండ్రకాదులు శ్రీకృష్ణునిఁ దాఁకుట

మయంబున రి భీష్మతనయ
నాసురంబునఁ గొంచు రుగుట నెల్ల
విని చైద్యమాగధవిభులాగ్రహమునఁ
నిరంతఁ బౌండ్రుకసాల్వవైదర్భు
“లెక్కడి కృష్ణుఁడు? క్కడి రాముఁ
డుక్కడంచెద”మని యురువడిఁ గదలి
టులఘోటకకరిస్యందనవీర
పాదహతుల భూభాగంబు వగులఁ
బేర్చినయలుకలఁ బృథులరావముల
నార్చుచు దాఁటిరా యాదవోత్తములఁ
విసియుఁ గార్చిచ్చుతిఁ బెచ్చు పెఱిగి
విరళంబుగ వెంటనంటఁ దాఁకుటయు
నాడ బలభద్రుఁ నుజన్ముఁ జూచి
“యీ యింతియును నీవు యిందుండ నేల? 
కొని వేగమరుగు మీకూటవ మూఁక
ణఁచి యేనునుఁ గూడ రుదెంతు” ననుచుఁ.     160