పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : మాయావతి ఆరూఢయౌవనుఁడగు ప్రద్యుమ్నుని గాంచి మోహించుట

తికాససేసి గౌవము వోనాడి
తురత గతులను రసభావమున
నాపడఁతి యొకనాఁతిరహస్యము(న)
పైపడి పట్టిన భావజుండలిగి
“కటకటా! ఈ పని ర్హణంబనక
నిటు సేయఁదగునమ్మ! ఇందీవరాక్షి! 
ల్లివి నీవు నీ నయుఁడ నేను
చెల్లునే పాపంబు సేయంగ నీకు? 
క్కడ వినఁజూడమిట్టి దుర్నీతి
నెక్కడగలిగె! నీవెవ్వతవ” నుఁడు; 
రికిరుక్మిణికిని వతరించుటయు
నెఱిఁగి శంబరుఁడు తానిందుఁ దెచ్చుటయు
జేరిన చందంబుఁ జెప్పె, వెండియును
నారామ భావజు ల్లన పలికె. 
“రతినేను నా పుష్పతుఁడవు నీవు 
ప్రతిలేదు యాదిదంతులము గాన
వీఁడొక గతిగాదు వీని నిర్జించి
దండిమై మనము వోము ద్యారవతికి. 
తఁడు మాయావిధంబెఱుఁగు నీతనికిఁ 
బ్రతిలేని విద్యలభ్యాసంబు సేయుఁ;“     300
నుచు మాయావతి మ్మహావిద్య
నసిజునకు నిచ్చె మంత్రయుక్తముగ 
ప్రద్యుమ్నుఁడంత నాడఁతిచేఁ బెక్కు
విద్యలునేర్చి యావెలఁదియుఁ దాను 
ధ్రుతిఁబూని వర్తింపఁ (దె)లిసి శంబరుఁడు