పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : దేవేంద్రాదులచేఁ బ్రార్ధింపఁబడి శ్రీకృష్ణుఁడు నరకునిపై దండెత్తుట

దేవేంద్రుఁడును సర్వదిక్పాలకులును
గోవిందుతో నర్ధిఁ గూడి చెప్పుటయు
విని సత్యభామతో విహగంబు నెక్కి
నుదెంచి ప్రాగ్జోతిము మీఁద శౌరి      560
గిరి దుర్గమంబు నగ్నిపరీతమగుచు
మురయంత్ర బహుపాశములఁ జుట్టివచ్చి
రులకభేద్యమైఁ రగు నప్పురికి
రుదెంచి పాంచజన్యధ్వాన మెసఁగ
నార్చిన నతిభీషణార్చులు నిగుడ
పేర్చి మిన్నందిన భేదింపరాక
రి శార్ఙ మెక్కిడి య్యగ్నిఁ (జ)ల్లార్చి
కులిశబాణంబునఁ గోటలుఁ గూల్చి
లువిడి మురయంత్ర పాశంబులడచి
దానవసేనలు ఱిమి పై నడవ
నానాస్త్రములఁ ద్రుంచె లినాక్షుఁడంత;