పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : చిత్రరేఖ చిత్రపటము వ్రాసి ఉషాకన్యకకుఁ జూపుట

“కటకటా! కలలోనన్న రాకొమరు
నెటుపట్టి తేవచ్చునే ముద్దరాల! 
తరుణులయందు నిటువంటి తలఁపు
యే తెఱంగునఁ జూచి యెఱుఁగము వినము, 
నీకేల ముచ్చట? నీకేల బెగడ? 
నీకేల వెనుఁబడ నీరజవదన? 
మూఁడు లోకంబుల ముదితయేఁదొల్లి
పాడిగా నెఱుఁగని పురుషులు లేరు; 
నా కౌసలంబున రవరోత్తముల
నీకుఁ జూపెదఁ జూడు నిఖిలలోకాన! 
చ్చి పొందిన భూపరుని నీమ్రోలఁ
దెచ్చి పెట్టెద నింత ధృతిఁ జిక్కఁబట్టు”
నిపల్కి నవ్వుచు నాచిత్రరేఖ
నుపడ నొక చిత్రటము సంధించి
కలలోకంబుల ననాథసుతుల
కలంకమతి వ్రాసి బలతో ననియె. 
“నీతలఁపుననున్ననృపకులోత్తంసుఁ
డేతెఱంగో వ్రాసితిటుజూడు” మనుచు;     830 
పాతాళవాసులఁ న్నగాధిపులఁ
జాతుర్యగుణుల రాక్షసకుమారకుల
లకూబరాది యున్నత యక్షవరుల
లజయంతాదుల సురాధిపులను
రుడఖేచరసిద్ధగంధర్వవరుల
రుసతో వేర్వేర నితకుఁ జూపి; 
లోనఁ గురుపాండవాదులఁ జూపి; 
యాదవవీరుల నందఱఁజూపి; 
దినారాయణుఁగు కృష్ణుఁ జూపి; 
నుమానపడి చూడ నంత ప్రద్యుమ్నుఁ
నియీతఁడాతఁడే కాఁబోలుననుచు
నములో శంకించి రియనిరుద్ధుఁ
నుకాంతి రూపంబుఁ ప్పకఁ జూచి
లఁపులోపలి కూర్మి ట్టుముట్టాడఁ
బులకించి తిలకించి పూఁబోడి పలికె. 
“కలలోనఁ గన్న చక్కని వాఁడె వీఁడు! 
లయల్ల నాకు నిక్కవమయ్యె నేఁడు! 
నీ కౌసలంబును నీ దయాగుణము
నీ కూర్మి పెంపును నీవచోరతియు      840
నాకంజసూతికి లవియే పొగడ? 
నాకెవ్వరికదిక్కు లినాయతాక్షి!“
ని పల్కి యంతంత తిశయంబైన
నసిజానలము పైలసి మట్టాడఁ
న్ను దానెఱుఁగక ర వ్రాలియున్న
న్నాతి బోధించి ల్లననెత్తి
న్నీరు దుడిచి యంగంబెల్ల నిమిరి
చెన్నార నెయ్యంబుఁజిలుక నిట్లనియె.