పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : బిలద్వారమందుండిన పౌరులు పురమున జేరి శ్రీకృష్ణుఁడు మడిసెనని చెప్పుట

చెన్నార వెన్నుని సేవించి వచ్చి
మున్ను బిలద్వారమున నున్న పౌరు
లాకంజలోచనుఁడాపెడ నడఁగి
రాకున్న బెగడి పురంబున కరిగి
యావార్త నెఱిఁగింప ఖిలబాంధవులు
దేకియును వసుదేవుఁడుఁ గలఁగి
దేతాగణముల ద్విజలోకతృప్తిఁ
గావించిరంత; నా మలలోచనుఁడు 
ద్వాకాపురి సొచ్చి గ నుగ్రసేను
నారూఢగతిఁ గాంచి యందఱుఁ జూడఁ 
బ్రీతి సత్రాజిత్తుఁ బిలిచి ప్రసేనుఁ 
డాల వని మృతుఁడైన చందంబు
రి జాంబవంతుఁడు ణి హరించుటయు
య నాతఁడు కయ్యమాడిన తెఱఁగు
చ్చుగా నెఱుఁగించి తనికారత్న
మిచ్చి మనోవ్యధ నెడలె మురారి.      400
త్తములగు వారికొక నింద వొడమ
నుత్తలపడి తీర్పకోర్తురే నిలువ! 
అంత సత్రాజిత్తుఁ మ్మణి దాన
వాంకుచేఁ గొని యంతరంగమున
సిగ్గును దుఃఖంబుఁ జిడిముడిపాటు
గ్గలంబొదవ నిట్లని విచారించె. 
“అక్కటా! శ్రీనాథు ఖిలలోకేశు
నెక్కటి నిందించి నృపకోటిలోనఁ
బాపంబు సేసితిఁ ద్మాక్షుచిత్త
మేపాటి నొచ్చెనో యేమిగాగలదొ? 
రిమానసము రోషడఁగెడు నట్టి
వెవేదియో” యని వి(న)పాటు నొంది