పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : భూదేవి శ్రీకృష్ణుని బ్రార్ధించుట

“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిహ్న! 
భానువత్సంకాశ! క్తలోకేశ! 
కంబుచక్రగదాశి నశార్ఙహస్త! 
అంబుజనాభ! పీతాంబరాభరణ! 
విశ్వవిశ్వంభర! విశ్వైకజనక! 
శాశ్వత! సర్వజ్ఞ! ర్వలోకేశ! 
నీలామనోనాథ! నిఖిలాండనాథ!
[ఒకే పాదమున్నది]
రురజోరూపుమైఁ బుట్టింతు జగముఁ
మ! సత్వస్థితిఁ బాలింతు వీవ
తాసరూపుమై దండింతు వీవ
నీమేన జనియించు నిఖిలభూతములు     610 
ని యప్పులునభగ్ని వాయువులు
విసుధాకరులాత్మ రాజీవభవులుఁ
లేంద్రియంబులు కలశక్తులును
లంబు నీరూపు ర్చించి చూడ! 
పూతాత్మ! శ్రీకృష్ణ! పురుహూతవంద్య! 
నీ త్వమెఱుఁగంగ నేనెంతదాన? 
కుండు నీ దయ నాకుద్భవించు
పుత్రుఁడీతఁడు రశక్తి పేర్మి
దేతాద్రోహియై తెగియె నీచేత
దైవీక మెవరికిఁ ప్పింపరాదు! 
కావున నితనికి లిగె నీలోక
మేవిధంబున ధన్యుఁడిది లెస్సయయ్యె! 
దురితారి! వానిపుత్రుఁడు భగదత్తుఁ
రుణించి నీవ యిక్కడ ప్రతిష్టింపు”, 
ని మ్రొక్కి ధరణి జయాంకమై బఱఁగు
మాల మురవైరి క్షంబునందు 
పూజించి వీడ్కొని భూదేవి చనియె.