పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : బలరాముఁడు యుద్ధము చేయుట

మలాక్షు ననిచి యక్కామపాలుండు
మరసన్నుద్ధుఁడై తురత నిలిచి
యాదవనికరంబు త్యుగ్రసింహ
నాదంబుతోఁ దూర్యనాదంబు లొలియఁ
లకొని యొండొంటిఁదార్కొని మంట
లొలుక కైదువల సముద్ధతిఁ జూపి
రదంబునరదంబు శ్వమశ్వంబు
రిఁగరి కాల్వురుఁ గాల్వురుఁ దొడరి
యీరసంబునముట్టి యిరువాఁగుగిట్టి
పోరాడ సురులకద్భుతముగా నిగుడి
విలుకాండ్లు గవిసి దోర్వీర్యంబు మెఱసి
లునారసములు నిర్బరముగా నేయ
లువుర నేవుర లినుచ్చిపారఁ
లలొక్కపెట్టు భూలముల రాల్చి
థములఁ జెక్కి సాథుల నుక్కడఁచి
థరథ్యనివహంబు ణభూమిఁగూల్చి
రులఁ జెండాడి పుష్కరములఁదునిమి
రుల విదారించి యాశ్వికోత్తములఁ      170
బ్రాణంబు లెడలించి బాణసనములఁ
దూణీరములఁ ద్రుంచి దొరలగీటణఁచి, 
వారువీరనకెల్ల వారికాయములఁ
దోరంపురుధిరంబుఁ దోఁగించిరంత; 
దొంకెనపోటులు దూరఁగానాటి
బింకంబు లెడలక బెరయు వీరులును
గోరి పెక్కండ్రను గుదులుగాఁ గ్రుచ్చి
పేరువారెడునట్టి బిరుదులువారు; 
ల త్రెవ్విపడియు ముంఱఁ దమ్ముఁ బొడుచు
లియులనొప్పించి డియెడువారు; 
శిరములు పగిలినఁ జిందెలఁ గట్టి
రకుసేయకఁ బోరుల్పు లావరులు; 
దొఱసిన వేటాడితునుకలుగాఁగ
ఱిముఱిఁ దెగవేసి యార్చు రాహుతులు; 
సామజంబునడుము రిగుచ్చిపారఁ
దోమరంబుల వ్రేసి త్రుళ్ళు మావుతులు; 
వణిసారించి పల్లమును గుఱ్ఱమును
వుతును జిదియ భోన మ్రోచువారు; 
ఱోలుచు నెత్తురుఱొంపిలో మునిఁగి
కాలార్పనేరని రితురంగములు;      180
దారగండులు వడి రణిపై వ్రాలు
తేరులు వెసనోళ్ళుఁ దెఱచు పీనుగలుఁ
దిసిన కండలు దుపంబులైన
మెదడు మిడమిడమన్మిడుకు బొమ్మలును
వ్వెడి మోములు లినంగకములు
విఱిగినవిండ్లును విటతాటమైన
వుఱియలతోనొప్పు బొమిడికంబులును; 
రవాలకంకణలితమై పడిన
రములుఁ తుమురైన కాండకుంతములు; 
ఱియలైకూలిన లకలు నాజిఁ
ఱచుగాఁ దెగిపడ్డ వళచామరలు; 
నాడాడకునుజింపులై దూరమెడలి
చూడనక్కజమైన జోడుపక్కెరలు; 
నెత్తురు నెఱచియు నెరి బొట్టకోలఁ 
గుత్తుక బంటిగాఁ గ్రోలు భూతములుఁ; 
గొడపంపుఁ గంకాళి ఘోరనాదముల
వెడయాట లాడెడు వేతాళములును; 
లనొప్పు భూతేశుక్షంబు వోలె
లితకపాలమాలాయుక్తమగుచు      190
మధికదానఢ్య రసంబెవోలె
మనీయమార్గణనఘోషమగుచుఁ
లగొన వైశాఖకాలంబె వోలె
లినొప్పు బాణాసధ్వస్తమగుచు
విహితమహారణ్యవిభవంబె వోలె
హుఖగనాగసంప్రస్థితంబగుచు
రభసనై దాఘమయంబె వోలె
సురుచిరవాహినీశోణితంబగుచు
హనీయవారాసిధ్యంబె వోలె
హజబాడబఘోషసౌరభ్యమగుచు
లమి బీభత్సభయానకరౌద్ర
లితమై యొప్పారి లనొప్పెఁజూడ; 
ట్టించెనంత యావసేనఁదఱచు
నెట్టన నాచైద్యనృపుసేన విఱిగె. 
 మగధసేనలుఁగూలె డిసెవైదర్భ