పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : బలరాముఁడు మిథిలానగరమునకు వెళ్ళుట; అచ్చట దుర్యోధనుఁడతని వద్ద గదాయుద్ధ మభ్యసించుట

“ఈ మిథిలాధీశుఁ డితఁడు నా సఖుఁడు
కామించి యారాజుఁ గాంచి వచ్చెదను
నీవు పొ”మ్మని పల్కి నీలాంబరుండుఁ
వేవేగ మిథిలకు విచ్చేయ నతఁడు
యెదుఱేఁగి సీరికి నెంతయు వేడ్కఁ
దురొప్ప దేవోపచారసత్క్రియలు
తిభక్తిఁ బూజింప తనిగేహమునఁ
తురత నొకకొన్ని సంవత్సరములు
సి వర్తింప నక్కడ సుయోధనుఁడు
లితోడఁ బటుగదాభ్యాసంబు సేసె.