పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : బాణాసురుఁడు శ్రీ శంకరునికిఁ దనయుద్ధకాంక్షఁ దెలిపి ప్రార్థించుట

తఁడు(ను) గర్వాంధుఁడై యొక్కనాఁడు
భూతేశు పాదాబ్జములమీఁద వ్రాలి      760
వినతుఁడై చేతులు వేయును మొగిచి
నుకంపఁ దోఁప నిట్లని విన్నవించె. 
“దేవ! మహాదేవ! దేవతారాధ్య! 
భావజసంహార! క్తమందార! 
నీవు ప్రసాదింప నిఖిల రాజ్యములు
నీవేయి చేతులు నివినాకుఁ గలిగె! 
వనిలో నాకంటె ధికుఁడు లేమి
నివి వృధాకథలయ్యె నిభచర్మవసన! 
తురగఖురోద్ధూతధూళి పెల్లగయు 
దురములోఁ దురగంబుఁ ద్రోలంగలేదు; 
మండిత దోర్దండ మండలాగ్రమునఁ
జెండాడి పగతులఁ జిక్కింపలేదు; 
టుల కార్ముకముక్త ర పరంపరలఁ
టు మాంసముర్వికి లిసేయలేదు; 
దంతికోదండ! గదాతాటనముల
దంతికుంభముల విదారింపలేదు; 
వీరరక్తంబుల వేతాళసమితి 
నారూఢగతి నోలలాడింపలేదు; 
యొఱపైన నృపలోకమురు శరీరముల
మెఱసి ఢాకినులకు మేపఁగలేదు;    770
నీయాన! రణకేళి నెఱపంగ లేదు! 
వేయిచేతులుమోవ విసమయ్యె నాకు
లన మీరెడుశక్తి లిగియు లేని
లమయ్యె ముచ్చట బాపవే తండ్రి!” 
ని గబ్బుమైనాడ సురమాటలకుఁ
గినిసి యల్లన నవ్వి గిరిజేశుఁడనియె. 
“నీవేమి సేయుదు నీపాలిదైవ
మీవిధిఁ బ్రేరింప నిట్లంటిగాక! 
దురములోపల నిన్నుఁదొడరి నీవేయి
రముల వ్రేఁగు నొక్కట మాన్పనోవు
లఘువిక్రమశౌరి యేతేరగలడు; 
లఁచిన నీకోర్కి లకూడగలదు. 
ప్పక నీకేతుదండంబు విఱిగి
యెప్పుడు ధరఁగూలు నెఱుఁగు మద్దినము
నుమోచునట్టి రణంబుగాగలదు. 
నములో నెఱిఁగి యేరక వర్తింపు”
ని వీడుకొలిపిన రునకు మ్రొక్కి
ని సంగరోద్యోగ తురుఁడై యుండె.