పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : బాణాసుర వృత్తాంతము

లోన బలిదానవాధీశసుతుఁడు 
వ్యాళేంద్రసదృశుఁడు వేచేతివాఁడు
నారూఢజయశాలి రిశైలవజ్రి
భూరిప్రతాపుఁడద్భుత బలోన్నతుఁడు
బాణాసురుఁడు తపోలముల పేర్మి 
స్థాణుని మెప్పించినపురంబునకుఁ
నివాసమున కాని రక్ష సేసి
నుపమజయకీర్తులంది పెంపొందె.