పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : అకౄరుని వృత్తాంతము

జాక్షుఁడును ద్వారతికి నేతెంచి
రారు మణి శతన్వుని వద్దఁ      440
గాక యుండుటఁ గాంతకుఁ జెప్పి
పూని సత్రాజిత్తు భూమివర్యునకుఁ
లౌకికంబులు క్తిఁజేయించె. 
య నారత్నంబు క్రూరుఁడెత్తి
కొనిపోయి వనభూమి కుశలియై యుండె. 
ఘమానసుఁడైన క్రూరుఁడరుగ
నా ట్టణంబున ఖిలమంత్రులకు
దూపిల్లె భయకష్టదుష్టరోగములు. 
ని చెప్పుటయు విని క్రూరుఁడెట్లు
పుణ్యుఁడయ్యె నక్కథఁ జెప్పుమనుఁడు; 
మున్నశ్వపాలుఁడు మొగి ననావృష్టి
ఖిన్నుఁడై కాశికేగినఁ గాశిరాజు
రువరంబునఁ గనె మృతాంశువదనఁ
లాక్షి కాందిని న కూర్మిపుత్రి; 
న్నెచేనన్నియీతి బాధలును 
శోరోగాదులు సోఁకక యడఁగు; 
న్యఁ బ్రీతిమై శ్వపాలునకుఁ
జేకొని వడిఁ బెండ్లిసేసి పంపుటయు
నానాతి వరియించి ఖిలదుఃఖములు
మాని సుఖించె నమ్మనుజవల్లభుడు,      450
యింతి సుతుఁడైన క్రూరుఁడలిగి
పోయినకతమునఁ బుట్టెనీపాప