పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : అంబిక శ్రీకృష్ణునిఁ బ్రార్థించుట

అంర కేశాంగర్థంబుఁ గొన్న
యంరాంబర జగదంబ యేతెంచి
కరిఁ బోరు శంరశార్ఙధరుల
నిరువురకడఁజొచ్చి యేపార నిలిచి
రిమోముఁజూచి యిట్లని నుతియించె. 
“వద! జగన్నాథ! సుదేవపుత్ర! 
దేదేవారాధ్య! దివ్యస్వరూప! 
గోవింద! మధువైరి! గోపాలవంద్య! 
నీవు మేల్కని చూడ నిఖిలంబుఁ బుట్టు
నీవు నిద్రించిన నిఖిలంబు నడఁగు! 
మాచే నఖిలంబు మాయగావించు
మాస్వరూప! చిన్మయ! హృషీకేశ! 
మూఁడుమూర్తులు నీవ మొగివానిమీఁద     990
పోఁడిగాఁ బెరిగెడి పొడవవు నీవ 
బాణుఁడు దనకు సద్భక్తుఁడుగాన 
స్థాణుడాతనికినై మరంబు సేసె; 
క్తవత్సలుఁడగు రమాత్మ నీకు 
క్తుఁడుగాని నీగవాఁడు గాఁడు. 
నికి నీకును నేమి భేదంబు? 
హిమతిఁ దలపోయ నేకరూపంబు! 
నీనామమేప్రొద్దు నిష్ఠతో జపము
పూని యనుష్టింతుఁ బుండరీకాక్ష! 
ను జూచియైనను నాగకంకణుని
నుకంప వీక్షింపు”ని సన్నుతింప
నాతజయశాలియైన కృష్ణుండు
శీజ్వరము మాన్చెఁ జెచ్చెర నంత.