పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : రుక్మిణి గౌరీ ఆలయమునకు వెడలుట

గౌరికి మ్రొక్కింపఁ రము సంప్రీతి
నారాజబింబాస్య టతోడి తేరఁ 
లికి రాయంచల తుల గీడ్వఱచుఁ
జెలువలు నలుగడఁ జెన్నారి కొలువ
హకాహళశంఖ ణవాదులొలయ
టుతరంబగు వీరటకోటి కొలువ
దేతనగరికే తెమ్మన్న, శౌరి
కావార్త యెఱిఁగింప వ్విప్రుఁ బంచె. 
మెలఁత నడక రుదెంచె నప్పు
డేనివర్ణింతు! భపురాధీశ!      90
డుగడుగిడుచోట వనియంతయును
డునొప్పు పద్మరాశ్రీవహించు; 
చ్చిఁ తపండ్లతో నుల్లసంబాడు
చ్చపలాక్షికి నంగుష్ఠచయము; 
నఖద్యుతులనుచరించు నెలవుఁ
దియ మౌక్తికములుఁట్టి నట్లుండు; 
రు గచ్ఛపనిధిద్వయ మింతిపాద
జాతముల మీఁద వ్రాలెనో యనఁగ; 
నజాడ్యము శుభారమును నగుచుఁ 
నీయలీల మీఁగాళ్ళొప్పు సతికి; 
డంపుఁదీగెలపంక్తులో యనఁగ
గువకు నొప్పారు డిమెల తీరు; 
రిసేయు మదనువుత్తళికలుఁ దమకు
నెతనంబంచును నెరసులు పలుకుఁ
కకాహళకాంతిఁ డచి చూపరకుఁ
నుపట్టు కాంతజంలు దన్యమగుచు; 
ళికాయుగళంబు టిభారమొప్ప
నవుఁ గరికరమళంబు పసిఁడి
తొచి ని(ల్పి)న భంగిఁ దొలుకాడు రుచులఁ
కంఠి కొప్పారుఁ రభోరుయుగము;     100 
వెవిల్తుఁ గల్యాణ వేదికతోడఁ
డఁబడు కొంత నితంబభారంబుఁ
శిరస్పర్ధియై నకపుపెట్టె; 
సైకతంబనా లనొప్పు కటియు; 
టిసూత్రఘంటికా నరత్నకాంతి
టిమతోనొప్పారు సిఁడిదువ్వలువ; 
కామునికై పుత్రకామేష్టి వెల్వ
హోగుండముభంగి నొప్పారునాభి
దలపల్లవసంకాశమగుచు
లుచనై కనుపట్టు భామిని కడుపు; 
మిన ముష్టిలోడఁగి చూపరకు
దులేదను వాదుఁ లిగించు నడుము; 
పూర్ణకుచవిహారాద్రులకిడిన
సోపానములభంగిఁ జూపట్టు వళులు; 
రినీలనాళంబులందుద్భవించు
గురుహేమసరసిజకోరకద్వయము
ణి నూఁగారుపై నకుచద్వయము
మొప్పుఁ జూడ నాకామినీమణికి; 
సిఁడి మించుల మించు ణఁతి కక్షములు; 
బివల్లి కలయోజ బెరయు చేఁదోయి;      110
కెంమ్మిరేకుల గెలిచి కెంపొదవు
నంమై లేమకు రచేతులమరు; 
విద్రుమలతలతో నీడు దోఁగాడు
విద్రుమద్యుతి చేతివేళ్ళు పెంపొదవు; 
లువరేకుల మించుఁ రనఖద్యుతులు; 
పొలుచు శంఖముభంగిఁ బొలఁతికంఠంబు
జంబుఁ దెలివియుఁ జంద్రకాంతియును
జాస్య నెమ్మోము రిసేయరాదు; 
చెలువారు పగడంపుజిగురకో! బింబ
మకో! యననొప్పు బామకెమ్మోవి; 
వెలఁది వెన్నెలనీట వెలసిన కుంజ
ళికెలో యననొప్పు కాంతపల్వరుస; 
హాసచంద్రిక ళధళ వెలుఁగు
రిదంతరుచి మించు గండపాలికలు; 
పొలుపైన పసిఁడతిల్పుష్పమో యనఁగ
లినాక్షి కొప్పారు నాసావుటంబు; 
చారు శ్రీవర్ణంబు రినచ్చులొత్తి
చేరినయట్లొప్పుఁ జెవులు రుక్మిణికి; 
కంర్పుఁడింపుగాఁ దల నిర్గమము
ముంట విల్లునమ్ములు నిడెననఁగఁ.      120
లాక్షి నెమ్మోముతామరమీఁదఁ
వంకబొమలతోఁ నుదోయి వొలుచు; 
శి యింతినెమ్మోము వతుగాలేక
లార సగమైన ట్లొప్పు నొసలు; 
నాంబుజాతంబు వాసనఁ గ్రోలఁ; 
దియు తేంటులభంగిఁ గాన్పించుగురులు; 
తొయ్యలి మోముచందురు వెంటఁదగులు
య్యహిభంగిఁ జెన్నగు నీలవేణి; 
భాజన్ముని నెత్తలకచందమున
నావామలోచనసలారె వెన్ను; 
కనూపురహారకంకణరత్న
లరోచుల దిశాభాగంబుఁ గప్పుఁ
రిరాజగమనంబుతి రాజతనయ
రుదెంచె గౌరినిజాలయంబునకు, 
భంగి సౌభాగ్యమెసఁగ నేతెంచి