పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : రుక్మిణీదేవి తనపురోహితుని శ్రీకృష్ణుని వద్దకు పంపుట

చింతించి “నేనింక శిశుపాలు నెట్లు
రియింతు? త్రైలోక్యరుఁడు నా విభుఁడు
రి నాకుఁ బ్రాణేశుఁడైఁ యున్నవాఁడు
నేనేమి సేయుదు నిటమీఁద నింక! 
నానోములన్నియు న్నుఁ ద్రెక్కొనియె
నెవ్వరు గలరింక నీబారి గడప? 
వ్వఁడోవుడు నాకు నీవార్తఁ జెప్ప.” 
ని పల్కి చింతించి వ్వరారోహ
న పురోహితపుత్రు ర్మచరిత్రుఁ
బిలిపించి యెంతయుఁ బ్రీతి నెమ్మోము
లఁగఁగఁ బలికె గద్గదకంఠియగుచు;     10 
“అఘాత్మ! మనవారు వనీతి సేసి
ను చైద్యపతికి నున్నతిఁ బెండ్లి సేయఁ
లఁచుచున్నారు నా లఁపు జీవనము
జాక్షుఁడనుచు నిశ్చలవృత్తినుందు
నీమాటలన్నియు నెఱిఁగింపరాదు
నామీఁదఁ గృపఁగల్గి న్ను మన్నించి
సి తోవుట్టినట్లుగాఁ జూతు
మెవు సేయకఁ జిత్త మెఱిఁగి వర్తింతు
టుగాన నాకైన క్కరఁ దీర్ప
నిట నీవె కాక యింకెవ్వరు బంధు
లాసంబునఁ జని యా ద్వారవతికిఁ
బోయి కృష్ణునిఁగాంచి పొసగంగఁ జెప్పి
రుఁ డెత్తుకోల నామానంబు గొనును
రువెత్తి రాకున్నఁ రిణయలగ్న
మెడ లేదు! తానింక నేతేరకున్న
విడుతుఁ బ్రాణంబులు వేరొండులేదు.” 
నిన నా విప్రుఁ డు తివచోధనుఁడు