పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : పురోహితుఁడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రుక్మిణి ప్రేమను రూపును వర్ణించుట

నియె సత్వరమున శౌరిసన్నిధికి, 
రుదార ద్వారపాలావళిచేత
రివిని యెదుఱేఁగి యా విప్రవరునిఁ      20
దోడ్కొనిపోయి సంతుష్టుఁ గావించి
వేడ్క ప్రియంబును వెలయ నిట్లనియె
“ఎవ్వరు బుత్తెంచి రెందుండి వచ్చి
తెవ్వరు నీ నామ మెఱిఁగింపు” మనిన
“అఘాత్మ! భీష్మకుంను విదర్భేశు
య రుక్మిణియను వళాయతాక్షి
నుమధ్య యత్ఫుల్ల తామరసాక్షి
(ఒకే పాద మున్నది)
రుడకిన్నెరయక్షగంధర్వసతులు
దొయలేరాయింతితో నీడుఁబోల్ప; 
దేర సౌభాగ్యదివ్యవర్తనలు
వావిరి జనులెల్ల ర్ణింపుచుండ
విని పుశ్పధన్వుని విషమబాణములు
నువొందఁ దనువున టనాటుటయును
జిత్తంబులో నీదు చెలువైనమూర్తి
చిత్తరువొత్తిన చెలువంబుఁదోఁపఁ
జింతించు వెఱఁగందు చేష్టలు మఱచు
నంకంతకు నిన్ను భినుతి సేయు
విహాన్ని శిఖిఁ గ్రాఁగు వెలువెలనగుచు
రులెత్తినట్లు పల్మరు చిన్నఁబోవు
నీభంగినున్న యీయిభరాజగమనఁ.      30
బ్రావంబునఁ జైద్యతి పెండ్లియాడ
నెల్లుండి చనుదెంచుటెఱిఁగి యాయింతి
యెల్లవిధంబుల నిది నీకుఁ జెప్పఁ
[జెప్పు]
బుత్తేర వచ్చితిఁ బుండరీకాక్ష! 
చిత్తంబు నొండు చింతింపగనేల? 
భామ నిజభార్యయై యుండునట్టి
సౌభాగ్యమెవరికి మకూరు? నీవు
నారుక్మిణిభ్భంగి నాసలుఁ సేయు
కారుణ్యమూర్తివి మలాక్ష! నిన్నుఁ
సి నీదరహాసకౌముదిఁ గ్రోల
ముదితనేత్రచకోరములు చేరఁగోరు
వడి నీప్రయాణాంబువులోన
కంఠిచాతకి డువేడ్కసేయు; 
నీ వెటులైనను నేచిన వేడ్క
నావెలందుక నేలుది నీకు నొప్పు; 
నిను నమ్మియుండిన నెలఁతుకనొకఁడు
కొనిపోవఁగఁ జుడఁగూడునె (హరి) నీకు? 
పువరాంగణములఁ బొరి దుర్గఁగొలువ
రుదేర నాకన్య నాసురలీల
రియించి చైద్యభూరుసైన్యములను.      40
గున సమయించి లజాక్షిఁ గొనినఁ
గీర్తియు లాభంబు గెలుపు పౌరుషము
నార్తరక్షణమును గు నీకు కృష్ణ! 
ఈ కార్యమెడయైన నిందిరారమణ! 
కామినీమణి సువులు విడుచు
నిన్నిమాటలుఁ జెప్ప నెడలేదు వేగ
నున్నతి పరిణయంబొనరించుటొప్పు.” 
నియని చతురోక్తుల్లనఁ బలుక
నియ విప్రునితోడ నంబుజోదరుఁడు