పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుని యమరావతీ ప్రవేశము

ప్రమదంబుతో సత్యభామయుఁ దాను
మరావతికి వచ్చె మరారివైరి.      630
రిఁజూచు వేడుక నా పట్టణంపు
రుణు లొండొరులకుఁమకంబు లొదవ
లకారిచూపు నీవాళ్ళుగాఁ జేసి
యాలోకగురుఁజూచి రందంద వచ్చి; 
పొలఁతుల చూపు లప్పుర వీధులందుఁ
లువ తోరణములు ట్టినట్లొప్పె; 
భామల కన్నులపండువై సత్య
భామయుఁ దానును క్షీంద్రు నెక్కి
యేతేరనింద్రుఁడు యెదురేఁగి శౌరిఁ
దోతెంచి పూజలఁ దృప్తి గావించె; 
రి కుండలంబులయ్యదితికి నిచ్చి
రమానురక్తి సంభావించి మ్రొక్కె; 
నా దేవమాతయు నంబుజోదరుని
నాదట దీవించి క్కునఁ బేర్చి
చియు నింద్రుఁడు పరిర్యలు సేయ
చలిత సౌఖ్యాత్ముఁడై యుండెనంత.