పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుఁడు రుక్మిని ధ్వజస్తంభమునకుఁ గట్టి తలగొరుఁగుట

నపాగఁగొని ధ్వజస్తంబుంబుతోడ
మెలివట్టి మెడగట్టి మిడమిడఁ జూడ
లుకమైఁ బేర్చి పెద్దమ్మున శిరముఁ
లుపున జుట్టును బాఱఁగ గొఱిగి
యునిచిన ఖేదంబు నుమ్మలికంబుఁ
బెనుపాటు గదుర నిర్విణ్ణుఁడై యున్న
న్నను గనుగొని డలు దీపింపఁ 
న్నుల నీరొల్క ద్గద యగుచు
మొగము వెల్వలబార ముదమున సిగ్గు
గయుఁ దోఁపఁగ నిల్చి వైదర్భి పలికె.