పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుఁడు రుక్మిణిని దనరథముపై నెక్కించుకొని చనుట

ఆ న్యయును బ్రేమ నంబుజోదరుని
రాకాశశాంకవిరాజితవదను
రకుండలకర్ణమాణిక్యరుచిర
విచగండస్థలు విభవేంద్రవంద్యుఁ 
నారూఢయవ్వను తులసౌభాగ్యు
నారాయణుని హరిన్నళినాక్షిఁ గాంచి
సిగ్గును భయమును జిడిముడిపాటు
గ్గలింపఁగ నిల్చె నంబుజనయన; 
లోనఁగృష్ణుఁడు వ్వాలుగంటి
నాలింగనముసేసి ర్మిలినెత్తి      150
కొనిపోయి రథముపైఁ గూర్చుండఁ బెట్టి
నునయోక్తులఁ దేర్చి యంగంబు నిమిరి 
దాకుఁ జూచి “రము వేగ పఱవు 
ద్వాకాపురి”కని దైత్యారి కదలె.