పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుఁడు ఇంద్రప్రస్థమునకు వెడలుట

రంగ నింద్ర ప్రస్థంబున కరిగె. 
ఖిలలోకారాధ్యుఁగు విశ్వగురుఁడు
సుతరంబుగఁ బాండునుతుల నీక్షించి
సుతి గొంతికి ధర్మసుతునకు మ్రొక్కి
దియంగ భీమునిఁ గౌఁగిటఁ జేర్చి
వ్వుచుఁ దన మ్రోల మ్రులైయున్న
వ్వడి కవల నొక్కట నెత్తి ప్రేమ
నంఱి సేమంబుడుగంగ వార
లంఱుఁ బూజింప నానందమంది
గొంతియుఁ గృష్ణు నక్కునఁ జేర్చి దుఃఖ
మంకంతకుఁ బేర్చి యార్తిమై నేడ్వఁ     470
ర పల్లవంబునఁ న్నీరుఁ దుడిచి
రుదండఁ దన మేనత్త నూరార్చి
ర్మనందను గేలు నకేలఁ బట్టి
ర్మిలి నిగుడ నిట్లనియె నాశౌరి,