పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుఁడు శతధన్వునిఁ జంపుట

మాట విని కృష్ణుఁ బల నూరార్చి
రాముఁడుఁ దానును థమెక్కి కదలి
లాక్షిఁ దోడ్కొని ద్వారకాపురికి
రుదేర శతధన్వుఁ డాశ్యమంతకము
క్రూరునకు నిచ్చి తిజవాశ్వంబు
విక్రమంబున నెక్క, హలియును దాను
టురయంబున వానిజ్జఁ దాఁకుటయుఁ
టులత వాని యశ్వము జనం బెడలి
మోర్వకను బడి ప్రాణముల్ విడిచె. 
తుగంబు కూలినఁ దోరంవు భీతి.      430
నాతఁడు కాల్నడ రుగుటఁ జూచి
యాతరయమున రదంబుఁ ద్రోలి
చక్రధారచేఁ గంఠంబు నఱికి
నువెల్ల నరసి రత్నముఁ గాన లేక
“శధన్వు నూరకే చంపితి నకట! 
డు మహామణి నెందుంచినాఁడొ? 
సికొందము గాక” ని రథంబెక్కి
రుదేర హలపాణి రికిట్టులనియె.