పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణజాంబవంతుల యుద్ధము

ట్టహాసము సేసి రిఁగిట్టి ముష్టి
ట్టసంబులఁ బాదఘాతల నొంపఁ 
డఁగి మాధవుఁడు నిర్ఘాతంబు వోని
పిడికిటఁ బొడిచిన బెదరక జాంబ      370
వంతుఁడు మురవైరిక్షంబుఁ బొడువ
నంకాకారుఁడై రివానిఁ దాఁకె
రువురు నీరీతి నిరువది దినము
లురువడి పోరాడి యొగి కైటభారి
ల్లూకపతిగుండెఁ గులంగఁ బొడువ
నొల్లనొల్లన వోయి యురుమూర్ఛఁ దెలిసి
యేయుగంబులయందు నీరీతిఁ దొడరి
పాకిర్వదినాళ్ళు వరంబు సేయ
నెవ్వీరునకుఁ జెల్లు నితఁ డింత సేసె
నెవ్వరోకో! అని యిచ్చలోఁ దలఁచి
యంబుజోదరు నట నాత్మలోఁ దెలిసి
జాంవంతుఁడు భక్తి సాష్టాంగ మెఱఁగి
చేతులు మొగిడించి శిరసునఁ దాల్చి
యాతప్రీతి నిట్లని సన్నుతుంచె. 
“దేవ! జగన్నాథ! దేవేంద్రవంద్య! 
గోవింద! కృష్ణ! ముకుంద! సర్వేశ! 
నీవాదిమూర్తివి నిగమార్థవిదులు
భావించి కనియెడి రమాత్మవీవ! 
పొరిపొరి బ్రహ్మవై పుట్టింతు జగము! 
రిమూర్తివై నీవె నిశంబు బ్రోతు!     380 
రుఁడవై యడగింతు ఖిలభూతములఁ
మాత్మ! నీలీలఁ బ్రణుతింప వశమె? 
రథాత్మజుఁడవై రణిఁ బాలించి
కంఠు గెలిచి సీతాదేవిఁ దెచ్చు 
శ్రీరాముఁడవు నిన్నుఁ జింతింప మఱచి
వైరంబు గొని పోరి వంచితు నైతి
నాప్పు సైరించి న్ను మన్నించు
నీ త్వ మెఱుఁగంగ నేర్తునే” యనిన
“నాతోడ నిరువదినాళ్ళు పోరాడ
భూతేశునకునైనఁ బోలునే యందుఁ
బెద్దవు నీవు నా పిడికిళ్ళు దాఁకి