పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శిశుపాలుఁడు క్రోధముతో హరిపైఁ గవయుట

అంత నా శిశుపాలుఁ డందఱఁ జూచి
యెంతయు దర్పించి యెలుఁగెత్తిపలికె. 
“కడుఁ గ్రొవ్వి గొల్లలుఁగానక నన్నుఁ
దొడరి నేనున్నచోఁ దొయ్యలినెత్తి      200
కొనిపోయిరిద్దఱు కూల్చెద నొండె
నియాజి వారిచేఁ చ్చెద నొండె
యిట్టిజీవమునొంది యింటికిఁ బోవ
నెట్లోర్తు? నాశౌర్యమెన్నటికింక!” 
నిపల్కిపేర్చి తాటు సేనఁదాఁకి
నసమూహమునేర్చు హ్నిచందమున
రమిడి పటురథదంతియశ్వములఁ
బొరిమార్పఁ దద్బలంబులు పెల్లగిల్లె. 
లమువీఁగుటఁ జూచి లభద్రుఁ డంత
లముసలోగ్రబార్గళుఁడగుచు
రదంబు డిగివచ్చి యాసాల్వతేయు
రదంబునుగ్గుగా డచిన నతఁడు
దపుచ్చుకొనిఁ సీరిఁ దియ నాలోన
దలించి మాగధుఁ డ్డంబు దాఁకి
రపరంపర లేయ, డిసి మాగధుని
రులను సారథి వలీలఁ గూల్చె, 
తేరిపై నురికి యద్వృత్తిఁ గంఠమున
నీరంబుఁ దగిలించి చెచ్చెరఁ దిగిచి
రోఁకట నడపఁగ రుధిరంబుఁ గ్రక్కి
వీఁకరి మాగధవిభుఁడు మూర్చిల్లె;      210
క్కజంబుగ వాని రదంబు మీఁద
నెక్కించుకొని సాల్వుఁడేఁగె నాలోన
తని(తో)తోడనే ఖిలసైన్యములు
(నా)తురఁబడి గుండెవియఁగ బఱఁచె.