పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శీతజ్వరపీడితయై తాపజ్వరము శ్రీకృష్ణుని శరణు వేఁడుట

శీతజ్వరంబుఁ జెచ్చెర నేయుటయును
భూతకోటులు భయభ్రాంతిఁ గంపింప
తాపజ్వరంబు మేన్దప్పి కదియ్య
వాపోవుచును వచ్చి వారిజోదరుని
దములపై వ్రాలి ప్రణుతింపదొడగె. 
“యదువంశవల్లభ! ఖిలలోకేశ! 
కారుణ్యమూర్తివి కంజాతనేత్ర! 
వారిజోదర! భక్తత్సల! కృష్ణ! 
నెట్టున నీశక్తి నిఖిలజంతువులఁ
బుట్టింతు రక్షింతు పొలియింతు వీవ! 
ప్రకృతియుఁ బురుషుఁడు రమశాంతియును
వికృతులనానీవ విశ్వలోకేశ!” 
ని సన్నుతించెడు మ్మహాజ్వరముఁ
నుఁగొని పలికె నామలనాభుండు. 
“నీవేల వెఱచెదు? నీవున్న యెడల
సేవ నపథ్యంబు సేసిన వారిఁ      980
గారింపుమర్థి నీథ విన్నయట్టి
వారిఁబొందక నీవు ర్తింపుచుండు.” 
శీతజ్వరంబంత శివు మేను సోఁకి
యాతతజాడ్యంబు నావలింతయును
నమైన యాతన గంపంబుఁ గదిసి
నుమోడ్చి నిద్రించుతి నుండెనంత;