పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : శంబరప్రద్యుమ్నుల యుద్ధము

తివేగమునను మహాగ్రహంబొదవ
దనునిఁ దెగటార్ప ది విచారించి
దఁగొని లయకాలకాలుఁడోఁ యనఁగఁ 
ఱతెంచి వైచిన భావజుండలిగి
యఱక యాతని వక్షమురుముష్టిఁ బొడిచె; 
వాఁడు మహాశక్తి వైచిన మరుఁడు
పొడిగాగ నది ద్రుంచెఁ బుడక చందమున. 
ప్పుడయ్యసుర మహాబలం బొదవ
నుప్పరంబెగసి పై నురగమై పడిన
రుడుఁడై యాపాము ఖండించెమరుఁడు; 
తిరుగక దనుజుఁడు ధీరుఁ డై పేర్చి
నదమైఁ పాషాణరుషంబుఁ గురియ
నిలుఁడై విరియించె, ద్రియై పడిన
కులిశమై దునుమాడె, కొంకొక వాఁడు
లుషించి కేల ఖడ్గము నెత్తుకొనుచు      310
లువిడిఁ గవిసిన భావసంభవుఁడు
లఁ ద్రెవ్వనేసె నుద్ధతకోవుఁడగుచు, 
దేవసంఘములార్చె దివిఁ బుష్పవర్ష
మావిష్ణుతనయుపై నందంద కురిసె.