పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీ కృష్ణుఁడు రజకుని రూపుమాపుట<

రా చీరలఁ దెచ్చు జకుని శౌరి
చూచి యల్లన నవ్వుచుం జేరి పలికె. 
డివాల! మాకైన ణుఁగుఁ1-5 బుట్టములు
డువేగఁ దెమ్మన్న” నలి వాఁడనియె. 
ద్దిరా! లెస్సవో గునగు మీకు
దిద్దంగ వచ్చునే తివిరి మీ గుణము
నిను విచారించవు, నినుఁ జూచు కొనవు
నునె యీ రాచవనము లడుగగ
డవులలో మందలాఁగి రానేల? 
పొలు పెట్టెడు పుట్టుభోగులు మీరు
రిఘమ్ములును గోరుడము గొంగళ్ళు
కంచుకోకలు ట్టుడు మీరు
ఈ రాచ)కోకలు యిమ్మన్న నెట్లు,
నోరాడె? నొంచితి, నొవ్వకుం” డనిన, 
శౌరికోపించి యాచాకలిఁ బట్టి. 
************************   - 40
పిడికిటఁ బొడిచినఁ బెల్లుగా నేలఁ
డి తన్నుకొని వాఁడు ప్రాణముల్ విడిచె; 
డివాఁడుఁ గూలిన వానితోవచ్చు
డివాళ్ళు బెగ్గలి డుఁగులు1-5 వీడి
నుఁగొని పారినఁ న్నిచ్చ వచ్చు
నుపారు చీరలు రయించి శౌరి
రామునకును గోపాలసంతతికి
యు వస్త్రములిచ్చి వారును దాను


1-5) మణుఁగు = మడుగు = ఉతికిన బట్టలు