పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీ కృష్ణుండు కంసుని పంపున నేతెంచిన రక్కసుల రూపడరించుట

ని పుచ్చుటయు దైత్యు సమసాహసులు, 
నుదెంచి వారితో మరంబు సేయ
నా రామకృష్ణులు వ్వీరవరులఁ
దోరంబు గల వింటితునుకల నడచి   - 90
మెసి కంసుని యింటి భృత్యుని బలునిఁ
రిమార్చి యందఱిఁ ఱపి యాలోన
మ్మన నాయుధాగారంబు వెడలి
యిమ్ములఁ బురలక్ష్మి నెలమిఁ జూచుచును
నొప్పార నందాదులున్న యయ్యెడకుఁ
ప్పకఁ జనిరంతఁ పనుఁడుఁ గ్రుంకె.