పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : సాంబుఁడు దుర్యోధనుని కుమార్తె లక్షణ నపహరించుట

అంబుజోదరపుత్రుఁ తిరథోత్తముఁడు
జాంబవతేయుండు సాంబుఁడు ఘనుఁడు
కోరి ధుర్యోధను గూఁతు లక్షణను
వారణవురి స్వయంరమునందునను
రియించి కొనిపోవ వారలందఱును
గురుపతి కెఱిఁగింపఁ గోపించి యతఁడు 
మేమిరా! సాంబుఁడే నాతనూజ
నేమని కొనిపోయె నెట్లు జూచితిరి? 
కురువంశజులతోడఁ గూడి యాదవులు
రిణయప్రాప్తులే రికించి చూడ? 
డుచువాఁడీకన్య లిమిఁ గొంపోవఁ 
డయకఁ జూచుట గవుగా దతని
ట్టి తెత్త” మటంచు లములతోడ
ట్టుఁడై వడి సుయోనుఁ డుగ్రవృత్తి
వెడలి యార్పుచుఁ దాఁకి విష్ణునందనుని
డయక శస్త్రాస్త్రతుల నొప్పింపఁ  260
నిపోయి తిరిగి యగ్గలికమై వేఁచి
న రథంబఖిలవర్తనలఁ గ్రీడింపఁ
డియార్చి విలుగుణధ్వని చేసి శరము
లడరింపఁ గురుసేన నందొక్కపెట్ట
మురిసె రథంబు లమ్ముల గీటణంగెఁ
రులు రోఁజుచుఁగూలెఁ గాల్బలం బణఁగెఁ
రమిడి సాంబు కోల్తల కోహటించి 
తిరిగిసేనలు రాజు దిక్కున కొదుఁగ
గినిసి యాతని శల్యకేతుఁడు దాఁకఁ
ని రాజుతమ్ముఁడు ర్ణ సౌబలులు
వెనుఁ బ్రావుగా బాణవృష్టి వేల్పుటయు
నువుసారించి యా దైత్యారి సుతుఁడు
కాఁడగ నేడు మార్గణముల సేసి
యేడు బాణముల మహీశు నొప్పించి
తని తమ్ముని నాల్గుమ్ములఁ గ్రుచ్చి 
తసాయకంబులు కునిపైఁ గప్పి 
తొలఁగక శల్యకేతుని విల్లుఁ దునిమి
లముల శరపరంరలఁ గూల్చుటయు 
తని విక్రమకేళి చ్చెరువంది
యతులితంబగు యోధులందఱుఁ గూడి - 270