పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : నారదుఁడు శ్రీకృష్ణుని లీలలను జూడనేతెంచుట

రిగివర్తించునో! రి నేర్పుకొలఁది
సివచ్చెదఁగాక నుచు నారదుఁడు 
3-15 భక్తి నేతెంచి డి ద్వారవతికి. 
నుదెంచుచో సత్య దనంబునందుఁ
నుపారుఁ బారిజామునీడ నొప్పు
విరులచప్పరములో విశదమై పొలుచు
రువంపు పువ్వులపానుపు మీఁద
ల్లవశ్రీమించి రగుకెంగేల
ల్లన రుక్మిణి డుగులొత్తుచును
కాళిందిసతియు లక్షణయును నిలిచి 
తావృంతంబులు నుపార వీవ; 
మ్ములమీయంగఁ గ మిత్రవింద; 
మ్ముకుందునకు నానందమొదింప
శంరాంతకు మూలక్తియో యనఁగఁ
బంబినరాగసంభ్రమచిత్త యగుచు
జాంవతీదేవి చందనంబలఁద; 
కంబుకంఠలు మదిఁరము సంతసము
లి సత్యభామయు నాగ్నజిత్తియును
లితంబైన వింజామరలిడఁగఁ; - 340 
కెంగేలఁగేలును గీలించి భద్ర
యంగుళాగ్రములొత్తి యందంద తివియ; 
లాలితమంగళాలాపంబులొలయఁ
గేళిమై నింతులు కెలఁకులఁ గొలువ; 
మండితకోటీరణికాంతి నిగుడ
కుంలరుచులు జెక్కుల నవ్వులొలయఁ; 
చెకి కౌస్తుభమణి శ్రీవత్సరుచుల
మాల యురమున వాసనఁ జూప; 
త శంఖచక్రాది చిహ్నములఁ
గేయూరకంకణాంకితబాహు లొలయ; 
హాకరుచిరచేలాంచలద్యుతులఁ
బాటిల్లి బాలాతస్ఫూర్తి నిగుడ, 
తెల్లదామెరమీఁది తేఁటి చందమున
ల్లనిమేను నున్నతశయ్యఁ జేర్చి
3-16 సుతులతోఁ గూడి సుఖగోష్ఠినున్న
యారూఢయౌవను నంభోజనయను
నారాయణుని సచ్చిదానందుఁగాంచి
ఱుఁగున నిలుచుండి హతి మీటుటయు; 
నెఱిఁగి దిగ్గనలేచి యెదురేఁగి మ్రొక్కి  - 350
మ్మునిఁ దోతెంచి ర్థిఁ బూజించి 
క్రమ్మన నెమ్మోముఁ నుఁగొని పలికె. 
మునీశ్వరచంద్ర! యోగీంద్రవంద్య! 
సేమేనీకు? నీశిష్యులు సుఖులె? 
మామీదగృపఁగల్గి మ్ము మన్నించి
యేమివిచ్చేసితి రెఱిగింపు” మనిన
ల్లననవ్వుచు రికేలుపాణి
ల్లవంబులఁబట్టి లికె నమ్మౌని. 
దినారాయణ! ఖిలాండనిలయ! 
వేదాంగవాహన! విశ్వప్రకాశ! 
విశ్వంభరాంబర! విశ్వంభరాఖ్య! 
విశ్వాత్మ! నిత్య! సువిజ్ఞానరూప! 
నీపేరు భవదుఃఖనీరధితేప! 
నీపాదములఁ బుట్టె నిఖిలతీర్థములు
తీర్థపూతుఁడవీవ తీర్థంబు నీవ
తీర్థఫలంబిచ్చు దేవుఁడ వీవ
నీజభవుఁడును నీతత్వమెఱుఁగ
నేరఁడు ననుఁబోఁటి నేర్చునే కృష్ణ! 
నిన్నుఁజూడగలేని నీరసాత్మకులఁ
న్నులు కన్నులే మలాభిరామ!  - 360
జాక్ష! నీపాదలజాతయుగముఁ
లఁపనేరని దుష్టముల నేమందు! 
ప్పక నీమూర్తి ర్శించి మ్రొక్కి
యిప్పుడే పనివింటి నిందిరారమణ! 
న్నులఁ జల్లగాఁ నుగొంటి మంటి
నెన్నిచందంబుల నేకృతార్దఁడను!” 
నిపల్కి కృష్ణున కందంద మ్రొక్కి
నియె నారదుఁ డొండు దనంబులోని


3-15 ఒకే పాదమున్నది

3-16 ఒకే పాదమున్నది