పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : కురువీరులందఱుఁ గూడి సాంబుని విరథునిగాఁ జేసి పట్టుకొనుట

కురుపతి విలుదుంచెఁ గొసరేది కర్ణుఁ
డరదంబు నుగ్గాడె హరుల గీటణఁచె; 
విరథునిగాఁ జేసి వెలఁదుకతోన 
రదంబుపైనిడి తనిఁ దోతెంచె. 
నాకన్య బెగడొంద నాకుమారకునిఁ
జేకొని బంధించి చెరఁబెట్టిరంత.