పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : ద్వివిదుఁడను వానరుఁడు తన చెలికాఁడగు నరకుని జంపినందులకుఁ బగఁబూని చెలరేఁగుట

“వివయ్య కురునాథ! ద్వివిదుండనంగ
రారు మైందుని మ్ముఁడు ఘనుఁడు
గిరిచరాధిపుఁడు సుగ్రీవుని మఱఁది
కుని చెలి మహోన్నత బలాధిపుఁడు
నారాయణునిచేత రకుఁడు దెగినఁ 
గ్రూవార్తకు మదిఁ గుమిలి మర్కటుఁడు
రి నడఁచెదనని ద్దేవుఁ డేలు
పుములు నూళ్ళును బొరి చిచ్చులిడుచు
కొంలు బెఱికి యుక్కున నూళ్ళ మీఁద
మెండుగావైచి భూమిని పాడుసేయ
నితల బతులను డివెంట బెట్టి
కొనిపోయి పర్వత గుహలలో డాఁచు  - 220
నీరీతి నుండగ నెఱిఁగి యాశౌరి
యూకనుండఁగ నొక్కనాడంత; 
వారాసి దాఁటి దైతకందరమున
కారూఢగతివచ్చి గచరాధిపుఁడు
మానినీమంజుళధురగానముల
వీనులకింపార విని యల్ల నచట 
రిగి చేరువనొక్క వనిజమెక్కి
రికింపుచున్నచోఁ డఁతుల నడుమ
నారుణితాక్షుడై యాసవక్రీడ
నారామలును దాను లరి పాడుచును
గోవులలోనున్న గోరాజుభంగి
దావేడ్క విహరించు తాలాంకుఁ జూచి
రియకాఁ దలపోసి 3-12 యాకీశనరుఁడు
రులెక్కి కిలకిల ధ్వనులు సేయుటయు
రుణులు నవ్వుచుఁ ను చూడ మేను
పి ఝంకించుచుఁ బండ్లిగిల్చుచును
బొలార్చి చూచుచుఁ బొరి మీఁదఁ బొలయు 
భ్రరాళిఁ గని యుల్కిడి పట్టుకొనుచు
వెలికిలపడి యాడి వెక్కిరింపుచును
వెలఁదులఁ గని వంగి వెనుకఁ జూపుచును - 230 
3-13 గోడిగంబులు సేయుఁ గ్రోతి సేఁతలకుఁ
జేడియలందఱుఁ జెలరేఁగి నవ్వ; 


3-12 కీశుడు = వానరము

3-13 కోడిగము = పరిహాసము, విలాసచేష్ఠ