పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : ధర్మరాజు రాజసూయయాగ విషయమై శ్రీకృష్ణుని యెదుట ప్రస్తావించుట

శౌరితోడ నజాతత్రుఁ డిట్లనియె. 
“లోకబాంధవ! చంద్రలోచన! భక్త
లోకరక్షణ! సితశ్లోక! లోకేశ! 
నీవెఱుఁగని యవి నిఖిలంబు లందు
లేవెల్ల యెడల 3-21 నిర్లేవుండ వీవ
వినుము నీ కెఱిఁగించు విన్నపమొకటి. 
నఘాత్మ! రాజసూము పేరి క్రతువు
సేయుదునని మదిఁ జింతించినాఁడ
నేయుపాయంబున నిదిసిద్ధి బొందు
నానతిమ్మనుఁడు నామతనూభవుని
యాననంబీక్షించి రి ప్రీతిఁ బలికె. - 510


3-21 నిర్లేపుడు = నిరహంకారి