పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : ధర్మజాదులు శ్రీకృష్ణుని సమ్మానించుట

మ్మహాత్మునిరాక రసి ధర్మజుఁడు
మ్ములుఁ దాను బాంవులతో నెదురు, 
చ్చి నమ్రుండైన సుదేవతనయు 
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చె; గోవిందు డంత
నిలనందను బ్రేమ క్కునఁ జేర్చి
నకు మ్రొక్కిన మాద్రి నయుల నరుని 
3-20 నువార నాలింగము సేసి వార
లందఱుఁ గొల్చిరా మరేంద్రులీలఁ
జెంది యప్పురిఁ ప్రవేశించె మురారి. 
పౌరుల కన్నులపండువ గాఁగ
భూరిపుణ్యుఁడు పాండవుల నగరికిని
రిగి కుంతికి మ్రొక్క మ్మహాదేవి
రమొప్పఁ గృష్ణుని గౌఁగిటఁ జేర్చి
యానందరసముబ్బి లుగులుఁ బారఁ
బూని యందఱఁ బ్రేమఁబూజించి కుంతి
పాంచాలసుతయు సుద్రయుఁ గృష్ణుఁ
గాంచి సాష్టాంగంబు రమర్థి నెఱఁగి
రి కాంతలును దాను న్యోన్య ప్రేమ
రిరంభణముల సంభావన క్రియల
లిపి యింపార మజ్జనభోజనములఁ
లసి క్రీడించిరి; మలాక్షుఁడంత
నాపాండవుల సేమమంతయు నడిగి
యాపార్థు గృహమున రుగ నన్నరుఁడు 
జ్జనభోజన హిత సౌఖ్యముల
జ్జగన్నాథుని తిభక్తిఁ దనిపి  - 500
హంసతూలిక పాన్పునందు సంప్రీతిఁ
గంసారి నునిచి కాల్గడనుండి క్రీడ
నడుగు లొత్తుచు నుచితాలాప లీలఁ
డఁగి వినోదింపగా ధర్మసుతుఁడు
నుదెంచుటయు శౌరి య్యన లేచి 
నర నానృపు కరస్థలిబట్టి తివియ
నేక శయ్యను వారలిరువురు నుండఁ
జేకొని తమ్ములు సేవించియుండ 
నారగించుము కృష్ణ! లసితీ” వనుచు



3-20 ఒకే పాదమున్నది