పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : బలరాముఁడు యాదవుల కోపమును జల్లార్చి స్వయముగా హస్తినాపురికి వెడలుట

రిఘోటరథభటోత్కరములతోడఁ
రిపురిపై దండుదలుటఁ జూచి 
లభద్రుఁ డది “యెంతని మీరలేమి
లఁచి కౌరవులపై దండుపోయెదరు? 
యాదవులందు నెన్నడు కౌరవులకు
భేదంబు లేనిచోఁ బ్రీతి నందెఱిఁగి
యేమిసేసిన వార లేమన్న వారొ! 
మార్గ మెల్లను ఱసి సామమునఁ
దెలిసి సాంబునిఁ దోడితెచ్చెదఁగాని
లహంబునకుఁబోవ కారణం బేమి?” 
ని వారి వారించి ట రథం బెక్కి
నియె నుద్ధవుఁడు తోఁనుదేర సీరి. 
రిగి వారణపురోద్యానంబులందు
రమొప్ప విడిసి యక్కామపాలుండు  - 280
నరాకఁజెప్పి యుద్ధవుఁ బంపుటయును
ని యమ్మహాత్ముఁడాస్ధానంబు నందుఁ
గురురాజు సచివు శకుని దుస్ససేను
గురు భీష్మకృపబాహ్లీకులు గొలువంగఁ
గొలువున్న యతనిఁ గన్గొని పొడచూపి
లభద్రురాక నేర్పడ జెప్పుటయును; 
తిసంభ్రమంబున నందఱుఁగూడి
తని సన్నిధికేఁగి ర్ధిఁబూజించి
సేమంబులడిగి యాసీరి నీక్షించి
“యేమివిచ్చేసితి రెఱిఁగింపుఁ”డనిన
ధార్తరాష్ట్రులును బాంవులును వినఁగ
నార్తరక్షణశీలి లపాణి పలికె. 
“కోరి మామేనత్త కొడుకులు మీరు. 
ఆరూఢి మీకు మేనల్లుఁడుగానఁ
న మేనమఱఁదలి రళాయతాక్షిఁ
నవునఁ గొనిపోయె సాంబుఁడు దీనఁ
లఁగి విరోధింపు ర్హంబుగాదు
వెలఁదితో నాతని విడిచి తెం”డనిన. 
ల్లన నవ్వుచు నాసుయోధనుఁడు 
ప్రల్లదంబున బలద్రుతో ననియె.  - 290