పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : బలరామ ద్వివిదుల ద్వంద్వయుద్ధము

తాలాంకుఁడొకరాత ర్పించి వైన
నాలోనఁ గోపించి తనిపై కుఱికి
చీలు జించి యాసీధుభాండంబు
బోనఁ బగులంగఁ బొడిచి దాఁకుటయు; 
కాపాలుఁడు వానిఁ డకతోఁ బట్టి
వేముష్టిఁ బొడిచిన వికవిక నవ్వి 
ప్రయకాలోత్తాలభైరవుభంగి
లియుఁడై మైవచ్చి లున కిట్లనియె. 
“నలినాక్ష! యేరీతి నాఁడు నామిత్రుఁ
మీరి నరకు నుద్దండతఁ జంపి
చ్చితి నేనేఁడు చ్చిన వాఁడఁ
జెచ్చెర సనురంబు సేయు నాతోడ! 
రార మైందుని మ్ముఁడ ద్వివిదుఁ
నువాఁడ శూరుఁడ ర్కజు మంత్రి
రామునకై పూని రావణుతోడ
భీమాహవము సేసి పేర్చినవాఁడ
నెకొన్న రణవీధిని ద్రుంచివైవఁ
గెసి నాచెలికాని కెలసంబుఁ దీర్తు.”  - 240
నిపల్కియార్చి మహాశూలమెత్తి
కొని వైచుటయు సీరి క్రుంకి మైఁదప్పి
ములంబుఁగొని బెట్టు మోదిన వాఁడు 
వె మహాతరువెత్తి వేసి యార్చుటయుఁ
ప్పించుకొని సీరి రుచరుమీఁద
గుప్పించి యుఱికి ముక్కున ముష్టిఁ బొడువ 
తెలక వానరాధిపుఁ డొక్క పెట్టు
రుణులు బెగ్గిలఁ రువృష్టిఁ గురిసె
లాంగూలమున వ్రేసి లి నఖాగ్రమున
నంగంబుఁ జీరి మేనందంద కఱచి
పిడికిటఁ బొడిచినఁ బెనుమూర్ఛ నొంది
డిలేచి యాబలద్రుఁ డాతనిని
మున జిక్క నాలి దగిలించి
లుకమై రోఁకట నందంద పొడువ
నువులు పగిలి మైదటెల్లఁ బొలిసి
నుమూసి నెత్తురు గ్రక్కిరోఁజుచును
విదాఁకి కూలిన ర్వతంబనఁగఁ 
బ్లగేంద్రుఁ డిలఁగూలి ప్రాణంబు విడిచె. 
విదలందఱు వెఱఁగంది కీర్తింప
దివిజసంఘము రాము దీవించిరంత - 250 
లిన నేత్రుండున్న గరికేతెంచి 
లి కృష్ణుతోడ నయ్యగచరు వార్త
వినుపింప శౌరియు వివిధ బాంధవులు
వినుతు లొనర్చిరి వెసరామునంత