పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుని ఇంద్రప్రస్థ ప్రయాణము

ని యుద్ధవుండిటు లాడువాక్యములు
విని సంతసమునొంది వెన్నుఁడాప్రొద్దె
యాకదుందుభి లపాణి యుగ్ర 
సేనాదులనుమతి సేయంగఁ గదలి 
భూలాధీశులు పుత్తెంచినట్టి
దూకభీష్ట వస్తువులిచ్చి యనిపి
టు సైన్య మేఘ పుష్పక బలాకాది
టులవాజులఁ బూని న్నద్ధలీల  - 480
రుడకేతనకాంతిఁ డునొప్పు తేరు
గురుతరంబుగ దారకుఁడు దెచ్చి మ్రొక్క
నారోహణము సేసి ఖిలబాంధవులుఁ
దోరంపు వేడుకతోఁ గొల్చి రాఁగఁ; 
జెలువారు కాంచన శిబిరంబు లెక్కి
యెమి పట్టపుదేవు లెనమండ్రు నడువ; 
3-19 నొప్ప పటహాదివాద్యంబు లొలయ
వందిబృందములు కైవారంబు సేయ
సండి పడవాళ్లు డిసి తోనడువ
తివైభవముల నిత్యప్రయాణముల
తురతఁ బెక్కు దేములుత్తరించి
జాతనేత్రుఁడు కలసంపదలఁ
బొలుచునింద్రప్రస్థపురము కేతెంచె.


3-19 ఒకే పాదమున్నది