పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత వైజయంతిక : వినతి

వినతి

ఇరివెంటి కృష్ణమూర్తి వారు ఆంధ్రసాహిత్య అకాడమీ కార్యదర్శి చే సారు. వారు ప్రాతఃస్మరణీయులు. వారిని స్మరించుకుంటుంటే ఇలా అనిపించింది.

తెలుగు సంప్రదాయ, పురాణ ఇతిహాస ప్రామాణిక గ్రంధరాజములు రచనలు ఇప్పటి తరమువారికే సరిగా అందుబాటులో ఉండుట లేదు. కనుక ఎంతయో నష్టపోవుచున్నారు. భవిష్యత్తు తరములకు ఇట్టి దౌర్భాగ్యము దూరము కావలెననిన, వాటిని వాడుకరులకు బహు సుళువైన, బహుళోపయుక్తమైన విధానములో ఉచితముగా, ఒకవిధముగా జెప్పవలెనంటే మన పోతన్నగారి అడుగుజాడలలో, అందించుట పరమ ఆమోద యోగ్యమైన పని అని అనిపించించి. మా శక్త్యానుసారము, పోతన తెలుగు భాగవతము లకు చెందిన వివిధ మూల పాఠములను గూడా, లిప్యంతీకరణ చేసి ప్రచురించుచున్నాము. ఇందు ఎందరో ఆత్మీయులు భాగవత అభిమానులు, సహకరించుచున్నారు. ఈ విచారసామ్యము అంగీకరించు వారు మాతో కలిసి పనిచేయుటకు ముందుకు రావచ్చును, లేదా స్వంతముగా చేయవచ్చును. వారికి చేతనైన సలహా సంప్రదింపులు చేయుదుము.

ఆ మహానుభావుని అధ్వర్యంలో వచ్చిన “పోతన భాగవత వైజయంతిక” యను ఈ అనర్ఘ వ్యాస సంపుటి యందు భాగవతోత్తములైన ఎందరో మహానుభావులు పోతనామాత్యుల వారికి వారి కావ్యకన్యకకు పుష్పాంజలులు, కవితాంజలులూ, మౌక్తికమాలలూ సమర్పించుకున్నారు. వారందరూ తెలుగలందరి సాంప్రదాయక ఆస్తి స్వరూపులని. ఈ రచనలు సైతము ఆంధ్రుల ఉమ్మడి ఆస్తి అని నమ్మకముతో వీటిని జాలతెలుగుల కుచితముగా అందుబాటులో నుంచవలెననియూ అభిప్రాయముతో దీనిని ప్రచురణ కర్తలైన ఆంధ్రప్రదేశే సాహిత్య అకాడమీ వారి సౌజన్యముతోనూ, జాలగూడులో ప్రచురించ బడిన ఆర్కైవ్యు.ఆర్గ్ వారి సౌజన్యముతోనూ, ప్రచురించ పరిసంకల్పించడం జరిగింది. దీనిని (దీనికి మూల గ్రంథ ఆ ప్రచురణయే) సహృదయులైన అకాడమీ వారు అభ్యంతరపెట్టరనీ, అంగీకరింతురనీ భావించుచున్నాము.

ఇందు గ్రంథసామ్య హక్కులున్న వారెవరికైనను అభ్యంతరమున్నచో దయచేసి మమ్ము హెచ్చరించ మనవి. తద్వారా మేము సంస్కరించుకొనగగలవారము అని మనవి.  

ఇందు ఆసక్తిగలవారు దయచేసి తమ అభిప్రాయములూ, సూచనలూ, ఆశీస్సులూ అందించవలసినదిగా మనవి.

* * *

భాగవజ జయంతిక సౌజన్యము ఆర్కైవ్.ఆర్గ్ archive.com