పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

: గజేంద్ర ధామ్ వద్ద తెలుగు భాగవతం

మానసససరోవరం - గజేంద్ర ధామ్ - ముక్తి నాథ్ ల వద్ద -

*చరణి బాగవతం*

GajendraDham-1
GajendraDham-2
GajendraDham-3భాగవత బంధువులారా, భాగవత ప్రియులారా, పోతన అభిమానులారా భక్తులారా, తెలుగు సోదరులారా ఇది మనం అందరం గర్వించదగ్గ విషయం. యాత్రలు అన్నింటిలోనూ కఠినతరమైనది పుణ్యవంతమైనది అయిన కైలాస యాత్ర. గజేంద్ర ధామ్ యాత్ర. అలాంటి పవిత్రతమ క్షేత్రాలలో నివేదించబడింది మన చరణి భాగవతం. ఇది సాధించి పెట్టిన మన మల్లిక్ పుచ్ఛా వారికి వారి కుటుంబ పరివారాలకు మా నల్లనయ్య ఆయురోగ్యాలు, భోగభాగ్యాలు, సుఖసంతోషాలుతో పాటు నిరంతర, అపార అండదండలు అందించు గాక. అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

CharaniBhagavatam [*చరణి బాగవతం* ఆండ్రాయిడు, ఐ ఓ ఎస్, కిండిల్ పరికరాలలో అందుబాటులోకి వచ్చిన పోతన తలుగు భాగవత ప్రచురణ.
మీ అందరి ఆదరాభిమానాలతో శుభాశీస్సులతో చక్కటి స్పందనలు తెచ్చుకుంటోంది. ఇది మీకు సుపరిచయమే కదా...]

ఈ మధ్యన 2017 సెప్టంబరు నెల 6 నుండి 9 తారీఖులలో మా ఆత్మీయ భాగవత బంధువు, ఐబిఎమ్ అనెడి భాగవత ఆణిముత్యాలు వ్యవస్థాపక అధ్యక్షులు, బమ్మెర పోతన అభిమాని, పరమ భాగవతోత్తములు మల్లికి పుచ్ఛా అనబడే పుచ్చా మల్లిఖార్జున రావు గారు మానస సరోవర యాత్ర వెళ్ళారు. హ్యూస్టను అమెరికా నుండి బయలుదేరి హైదరాబాదు మీదుగా హిమాలయాలలోని కైలాస పర్వతం, మానససరోవరం, గజేంద్ర ధామ్ మున్నగు పవిత్రతమ క్షేత్రాలు, పుణ్యతమ తీర్థాలు దర్శించుకుని తరించారు.

ఆ యాత్రలో ప్రధాన భాగంగా వారి భాగవత ఆణిముత్యాలు తాలూకు చరణి ఆప్ లు, పుస్తకాలు, సిడిలు మున్నగునవి మఱియు వాటితో పాటు ఎంతో పెద్ద మనసు చేసుకుని మన *చరణి భాగవతం" - ఆవిష్కరించి, పూజించి, భగవానునికి నివేదించారు, ఇంకా భాగవత పద్యాలను సభక్తికంగా ఆలపించారు.

ఈ సందర్భంలో వారి ఆనందహేళి వారి మాటలలో (తెలుగు అనుసరణ క్రింద original in English)

ఆత్మీయులారా,
ఎక్కడైతే గజేంద్రుడు మోక్షం పొందాడో ఆ పరమ పవిత్ర క్షేత్రం *గజేంద్ర ధామ్" వద్దకు వెళ్ళే మహద్బాగ్యాన్ని అందుకున్నాను. ఐబిఎమ్ తాలూకు సకల ఉపకరణాలను, ఎలక్ట్రానిక్ దస్త్రములుతో సహితంగా ఆ గజేంద్ర ధామ్ ఆలయంలో పూజించాను. కైలాస పర్వతం, మానస సరోవరం, గజేంద్ర ధామ్, ముక్తి నాథ్ మరికొన్ని పుణ్యక్షేత్రాలలో జరిగిన ఉత్తమోత్తమ నివేదన బహుశా ఇదే అయ్యుంటుంది. (అవును ఆ భగవానునికి మహాభాగవతాన్ని మించిన నివేదన ఏముంటుందండి.)

ఇది ఒక మహాద్భుత, గంభీర, వినమ్రోత్తమ అనుభవము. గుర్తు ఉన్నంతవరకు అన్ని పద్యాలు చదివాను. మామ్మగారికి, నాన్నగారికి, అమ్మగార్కి, వసంతకి, ప్రత్యక్ష పరోక్ష కుటుంబ సభ్యులకు, గురువులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు మఱియు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారకులు అయిన వ్యక్తులు అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ యాత్రలో నేను వేదాంతపరంగానూ, మానసికంగానూ, మతపరంగానూ మంచి పరిపక్వతను సంతరించుకున్నాను. . . .

Folks:
I had the Greatest Honor to be at the Same Spot where Gajendra Got Moksham. I Worshipped ALL iBAM Artifacts, including Electronic Files, at the Dham Temple. Perhaps, the Most Reverend Worshipped items ... At Kailash, Manasarovar, Gajendra Dham, Muktinath plus others.

It's a VERY SOBER AND HUMBLE EXPERIENCE. Recited all Padyalu I could remember. Thanked, Mamma, Nanna Garu, Amma, Vasanta, Immediate and Extended families, Teachers, Friends, and ALL THOSE WHO HELPED ME TO BE A BETTER PERSON OF WHAT I AM TODAY.Perhaps, I Matured Spiritually, Mentally, and Religiously in this Yatra.

My Focus is on iBAM Animation for Younger Generation Outreach. Hopefully, Gajendra and Swami Varu with the help of our Team will MAKE IT HAPPEN. CANNOT ASK FOR MORE ????????

Yes, I will have GAJENDRA AROHANAM TOMORROW MORNING. ASWAM, GAJENDRA, GARUDA AROHANAM THIS YATRA ??????