పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాకరణము


శోధన

  •  


పద శోధన

  •  

ఛందోపరిచయము : జాతులు ఉపజాతులు

తెలుగు భాగవతములో వాడిన పద్యాదుల లక్షణములు సూక్ష్మంగా

ఛందస్సు పరిచయము

జాతులు

1 కంద                 (జాతి)

క.

కంము త్రిశర గణంబుల
నంముగా భజసనలము టవడి మూఁటన్
బొందును నలజల నాఱిట
నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.
గణ విభజన
UII    IIII    UII        
భ        నల    భ        
కంము    త్రిశరగ    ణంబుల        
UII    UII    IIII    IIII    UU
భ    భ    నల    నల    గా
నంము    గాభజ    సనలము    టవడి    మూఁటన్
భ, స, నల, గా గణాలే ఉన్నాయి
6వ గణము – నల
1, 3, 5, 7 గణాలు – జ కాదు
చివరి అక్షరం (టన్) - U
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    1.    1వ, 3వ పాదాలలో 3 గణములు, 2వ, 4వ పాదాలలో 5 గణములు (త్రిశర గణంబుల – 3+5 – 8 గణములు)
2.    భ, జ, స, నల, గా – అనే 5 గణములు మాత్రమే ఉండాలి.
3.    (అన్నీ చతుర్మాత్ర గణములే)
4.    1వ,2వ పాదాలకు కలిపి మరియు 3వ, 4వ పాదములకు కలిపి 6వ గణము నల లేదా జ గణము కావలెను.
5.    బేసి గణము (1, 3, 5, 7 గణములు) జ కారాదు
6.    చివరి అక్షరము (2వ, 4వ పాదం చివరి అక్షరము) గురువు కావాలి. (స గణము కాని గా గణము కాని ఉండాలి).
•    యతి :
2వ, 4వ పాదాలలో – నాలుగవ గణాద్యక్షరం
•    ప్రాస:
వేయాలి.
•    ప్రాస: యతి
వర్తించదు
                                           
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     2611
ఉదాహరణ
9-263-క.
భూలనాథుఁడు రాముఁడు
ప్రీతుండై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్.    
కంద నిరూపణ
భ    భ    భ        
భూల    నాథుడు    రాముడు        
గా    గా    జ    నల    స
ప్రీతుం    డై పెం    డ్లి యాడె    బృథుగుణ    మణిసం
గా    గా    గా        
ఘాతన్    భాగ్యో    పేతన్        
గా    స    నల    స    గా
సీతన్    ముఖకాం    తి విజిత    సితఖ    ద్యోతన్
భ, జ, స, నల, గా గణాలే ఉన్నాయి
6వ గణము – జ
1, 3, 5, 7 గణాలు – జ కాదు
చివరి అక్షరం (తన్) – U
ప్రాస, యతి సరిపోయాయి.

 

2 ఉత్సాహము                           (జాతి)

ఉ.
సాచర్య మమర సప్త వితృవర్గమతి సము
త్సా మెక్క నొక్క గురుఁడు రణములు భజింపఁగా
నీహితప్రదాన లీల లెసగు కమఠమూర్తి ను
త్సారీతు లుల్లసిల్ల సంస్తుతింతు రచ్యుతున్.
గణ విభజన
7 సూర్య గణములు
UI    III    III    UI    III    UI    III
హ    న    న    హ    న    హ    న
సా    చర్య    మమర    సప్త    వితృ    వర్గ    మతి సము
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    ప్రతి పాదములో – 7 సూర్యగణములు + గురువు (U)
•    యతి :
ప్రతి పాదములో – 5వ గణాద్యక్షరం
•    ప్రాస:
వేయాలి
•    ప్రాస: యతి
వర్తించదు

పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     3
10.2-861-ఉత్సా.
చారుదేష్ణుఁ డాగ్రహించి త్రుభీషణోగ్ర దో
స్సాదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
దారుణప్రతాపసాల్వదండనాథమండలిన్
మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.

 

ఉపజాతులు

3 ఆటవెలది                                                 (ఉపజాతి)

నగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాఁటవెలఁది.
లేదా
నులు ముగురు పాడ నిద్ద రింద్రులు మృదం
ములు దాల్ప వంశ కాహ ళాదు
లేగు రర్కు లూదఁ నిరు మేళగతి నాట
వెలఁది యొప్పుచుండు విష్ణు సభల.
గణ విభజన
3 సూర్య గణములు    2- ఇంద్ర గణములు
III    III    UI    UIU    IIIU
న    న    హ    ర    నగ
నులు    ముగురు    పాడ    నిద్దరిం    ద్రులుమృదం
5 – సూర్య గణములు
III    UI    UI    UI    UI
న    హ    హ    హ    హ
ములు    దాల్ప    వంశ    కాహ    ళాదు
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    1వ, 3వ పాదాలలో - 3 ఇంద్రగణములు 2 సూర్యగణములు, 2వ, 4వ పాదాలలో 5 సూర్యగణములు
•    యతి :
ప్రతి పాదములో – నాలుగవ గణాద్యక్షరం
•    ప్రాస:
నియమం లేదు
•    ప్రాస: యతి
యతి బదులు ప్రాస యతి వేయవచ్చు
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     703
ఉదాహరణలు
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ఉదా:
ఉప్పుకప్పురంబు ఒక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ.

అనువుగానిచోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.

8-83.1-ఆ.
రా మహేశు నాద్యు వ్యక్తు నధ్యాత్మ
యోగగమ్యుఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమయిన వానిఁ రుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.

8-79.1-ఆ.
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి హోత్తరునకు
నిఖిలకారణునకు నిష్కారణునకు న
స్కరింతు నన్ను నుచు కొఱకు.

 

4 తేటగీతి                                                 (ఉపజాతి)

తే.
క్కఁ డర్కుఁ డిద్ధఱు జిష్ణు లొనర మఱియు
నిద్ధ ఱర్కు లీచొప్పుమ నేగురేసి
నాల్గు వంకలఁ గదిసి వర్ణన మొనర్ప
తేటగీతి విష్ణుని పేర్మిఁ దేటపఱచు.
గణ విభజన
1 సూర్య గణం    2 ఇంద్ర గణాలు    2- సూర్య గణాలు
UI    UII    IIIU    III    III
హ    భ    నగ    న    న
క్కఁ     డర్కుఁ డి    ద్ధఱు జిష్ణు    లొనర    మఱియు
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    ప్రతిపాదంలో – 1 సూర్యగణము 2 ఇంద్రగణములు 2 సూర్యగణములు.
•    యతి :
ప్రతి పాదములో – 4వ గణాద్యక్షరం
•    ప్రాస:
నియమం లేదు
•    ప్రాస: యతి
యతి బదులు ప్రాస యతి వేయవచ్చు
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     1061
ఉదాహరణ 1:
9-269.1-తే.
విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు
ర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యై నటించు
నీచు మారీచు రాముఁడు నెఱి వధించె
నంతలో సీతఁ గొనిపోయె సురవిభుఁడు.
ఉదాహరణ 2:
8-87.1-తే.
ఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
దిమధ్యాంతములు లేక డరువాఁడు
క్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

5 సీస పద్యము                               (ఉపజాతి)                 

సీ.
ఇం
ద్రలు తమలోన నిద్దఱిద్దఱుఁ గూడి
     తులకునాధారమైతనర్ప
మూడుచోటులనుండమొగినిద్ధఱర్కులు
     దియనాక్రియనొక్కదముమెఱయ
నిటువంటిపదములింపెసగంగనాల్గింట
     మధర్మగతినతియమునొందు
ట్టిధర్మమునకునాస్పదంబైపేర్చి
     యాతతచ్ఛందోవిభాతిఁదనరి
గీ.
 టవెలఁదియొండె దేటగీతియు నొండె
 విమలుభావ మమర విష్ణుదేవుఁ
 డొప్పు ననుచుఁ బొసగఁ జెప్పిన సీసంబు
 సిఁడి యగు ధరిత్రిఁ ద్మనాభ
గణ విభజన
భ    సల    ర    సల    న    త    హ    హ
UII    IIUI    UIU    IIUI    IIII    UUI    UI    UI
ఇం
ద్రలు    తమలోన    నిద్దఱి    ద్దఱుఁగూడి    తులకు    నాధార    మైత    నర్ప

లక్షణము
•    పాదాలు:    నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజిస్తారు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు (అత్యధికంగా – 30, అత్యల్పంగా – 22)
•    ప్రతిపాదంలోని గణాలు:    6 -ఇంద్ర గణాలు, 2 - సూర్య గణాలు
సీస పద్యము చివర ఆటవెలది లేదా గీతి ఉండాలి
•    యతి :
ప్రతిపాదంలోనూ
1వ – 3వ గణాద్యక్షరాలకి, 5వ – 7వ గణాద్యక్షరాలకి
సీస పద్యము చివర ఆటవెలది లేదా గీతి లకు వాటి యతులో. ఒకే యతి పాటించాటం ఐచ్ఛికం.
•    ప్రాస:
ఐచ్ఛికము
•    ప్రాస: యతి
వేయవచ్చు

పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     1047
ఉదాహరణ
8-87-సీ.
లుగఁడే నాపాలిలిమి సందేహింపఁ
     లిమిలేములు లేకఁ లుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి సాధువులచేఁ
    డిన సాధుల కడ్డడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ
    జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల
    మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
8-87.1-తే.
ఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
దిమధ్యాంతములు లేక డరువాఁడు
క్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?

ఉదాహరణ 2:
8-83-సీ.
రధర్మకామార్థ ర్జితకాములై
        విబుధులు యెవ్వని సేవ యిష్ట
తిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క
        వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?
        రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియు గోరక
        ద్రచరిత్రంబుఁ బాడుచుందు?
8-83.1-ఆ.
రా మహేశు నాద్యు వ్యక్తు నధ్యాత్మ
యోగగమ్యుఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమయిన వానిఁ రుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.
 

6 సర్వలఘు  సీసము.           (ఉపజాతి)

క.
     సర్వ లఘు సీసమునకు న                          
    ర్వాంఘ్రులనడుమ నింద్రణములు మూఁడై                        
    యార్యంచలఘగణంబులు                          
    నుర్వీధర త్రిలఘుయుగము నొకగీతితుదిన్
గణ విభజన
IIIII    IIIII    IIIII    IIIII    IIIII    IIIII    III    III
నల    నల    నల    నల    నల    నల    న    న
వవికచ    సరసిరుహ    యనయుగ!    నిజచరణ    గనచర    నదిజనిత!    నిగమ    వినుత!
లక్షణములు
సీసపద్యము నియమయులే గాక అన్నీ లఘువులే యుండాలి
•    పాదాలు:    నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజిస్తారు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు

•    ప్రతిపాదంలోని గణాలు:    6 -ఇంద్ర గణాలు, 2 - సూర్య గణాలు
సీస పద్యము చివర ఆటవెలది లేదా గీతి ఉండాలి
అన్ని లఘువులే అయ్యి ఉండాలి
•    యతి :
ప్రతిపాదంలోనూ
1వ – 3వ గణాద్యక్షరాలకి, 5వ – 7వ గణాద్యక్షరాలకి
•    ప్రాస:
ఐచ్ఛికం
•    ప్రాస: యతి
వేయవచ్చు

పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     1
ఉదాహరణ
11-72-ససీ.
వ వికచ సరసిరుహ యనయుగ! నిజచరణ
    గనచరనది జనిత! నిగమవినుత!
లధిసుత కుచకలశ లిత మృగమద రుచిర
    రిమళిత నిజహృదయ! రణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!
    టిఘటిత రుచిరతర నకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత!
    తతజపరత! నియమరణి చరిత!
11-72.1-తే.
తిమి కమఠ కిటి నృహరి ముదిత! బలి నిహి
పద! పరశుధర! దశవన విదళన!
మురదమన! కలికలుష సుముదపహరణ!
రివరద! ముని నర సుర రుడ వినుత!
                                                    - - -