పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాకరణము


శోధన

  •  


పద శోధన

  •  

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

వ్యాకరణం - ఛందోపరిచయం

      తెలుగుభాగవతంలో ప్రయోగించిన వివిధ వ్యాకరణ విశేషాలు సంకలనం చేసే ప్రయత్నంలో ప్రథమంగా ఛందోపరిచయం ఇక్కడ ఇవ్వబడింది.

      తెలుగుభాగవతంలో మొత్తం 31 రకాల ఛందస్సులు వాడారు. వీటన్నిటి ఛందోనియమాలు సంక్షిప్తంగా ఈ విబాగంలో ఇవ్వబడ్డాయి. ఏ స్కంధంలో ఎన్ని పద్యగద్యలు వాడారో పటము 1 లో చూడగలరు. అధిక ప్రాచుర్యం గల కంద, ఆటవెలది, తేటగీతి, సీసం, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం లాంటివే కాకుండ అరుదుగా ప్రయోగించే ఛందస్సులు కూడా వాడారు. 

Telugu Bhagabvatam

      పది రకాల ఛందస్సులు అయితే ఒక్కమారే వాడారు. అవి ఉపేంద్ర వ్రజము, తోటకము, పంచచామరము, భుజంగ ప్రయాతము, మంగళ మహాశ్రీ, మానిని, వన మయూరము, సర్వలఘు సీసము, స్రగ్విణి  మరియు ఒక శ్లోకము. వీటిలో తోటకము, మంగళమహాశ్రీ, వన మయూరము, శ్లోకము, స్రగ్లిణి అయిదింటిని షష్ఠ స్కంధ ప్రణీతం చేసిన నారయగారే ప్రయోగించారు. బొప్పన ఏకాదశ స్కంధంలో సర్వలఘు సీసం వాడారు. పోతన్న గారు ప్రథమ స్కంధంలో భుజంగ ప్రయాతము, దశమ స్కంధంలో ఉపేంద్ర వ్రజము, పంచచామరము, మానిని మొత్తం నాలుగు ప్రయోగించారు. 

దండకము, మహాస్రగ్ధర రెండు ఛందస్సులు అయతే రెండేసి మార్లు మాత్రమే ఉపయోగించారు. మానినీమానచోర దండకము దశమ పూర్వభాగంలోను, శ్రీనాథనాథా దండకము తృతీయలోను పోతనామాత్యులవారు వాడారు.

       ఉత్సాహము, కవిరాజవిరాజితము, లయవిభాతి, స్రగ్ధరలు మూడేసి మార్లు వాడారు. ఇంద్రవ్రజము, లయగ్రాహి లను నాలుగేసి మార్లు వాడారు.

మొత్తం 9014 లోను ఛందోబద్ధం కానివి అనగా వచనములు 2680, గద్యములు 14. ఛందోబద్ధమైనవి 6320. వీటిలో అత్యధికంగా 2610 కంద పద్యములు ఉన్నాయి. వంద పద్యాలకన్నా ఎక్కువ పద్యాలకు, వంద కన్నా తక్కువ మార్లు వాడిన పద్యాల వివరాలు పటము 2 , పటము 3 లలో చూడగలరు

morethan100&lessthan100

             

    గణాలు, యతి, ప్రాసల సూచనలు; జాతి, ఉప జాతులు; వృత్తాలు; దండక, వచన మున్నగు వాని సంక్షిప్త ఛందస్సు లక్షణాల వివరాలు కింది బొత్తములలో యివ్వబడ్డాయి.