పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : సూర్యోదయ వర్ణనము

3-123-వ.
మఱియుఁ దదీయసాంద్ర చంద్రికా వితానపట పరిభ్రమణ సంభ్రమణంబు నభినవ వితాన విరాజితంబై; చకోర సముదయ సామ్రాజ్య వైభవంబై; కుసుమశర భుజబలాతిశయాభిరామ హేతుభూతంబై; విరహిణిజన నికర హృదయ విహ్వలీ కృతాకారంబై; జగన్మోహనం బై యొప్పుచుండె నంతఁ గ్రమక్రమంబున.

టీక :-
సాంద్రమగు = దట్టమైన; వితానము = విరివి, సమూహము; పట = చుట్టుట, అల్లుట; అభినవ = సరికొత్త; అభిరామ = సుందరమైన.
భావము :-
ఇంకనూ, మెలి తిరుగుతుండెడి మేలుకట్టులు అలంకరింపబడినది; చకోర పక్షి సమూహముల సామ్రాజ్య వైభవం కలది; మన్మథుని బాణముల యొక్క భుజబలానికి కారణభూతమయినది; విరహిజనుల తత్తరపాటులకు కారణభూతమైనది ఐన ఆ చంద్రుని విరివిగా పరచుకొన్న దట్టమైన వెన్నెల జగన్మోహనంగా యుండెను. అంతలో క్రమక్రమముగా.

3-124-సీ.
నలినదళంబుల కలకొని వెలయించి
కువలయదళముల క్రొవ్వణంచి
కుసుమబాణుని పెంపు కొంత నివారించి
విరహులఁబట్టిన వెఱ్ఱిఁదెలిపి
యంధకారము నెల్ల తమును గావించి
చుక్కలతేజంబు జక్కఁబెట్టి
దచకోరంబుల దములువిడిపించి
నిఖిలజగంబుల నిద్ర మాన్చి

3-124.1-ఆ.
వేఁడిదీప్తి దిశల వెదచల్లి మునులును
మరసంఘములును ర్ఘ్యజలము
లొసఁగఁ బూర్వశైల దెస నభిరమ్యమై
తామ్రకిరణుఁ డైన రణి వొడిచె.

టీక :-
నలిన దళము = తామర రేకు; కలకు = బురద; వెలయించి = తేలించి; కువలయము = కలువ; చక్కబెట్టు = పోగొట్టు; పూర్వశైలము = ఉదయాద్రి; అభిరమ్యము = మిక్కిలి మనోహరము; తామ్రము = రాగిఎరుపు; తరణి = సూర్యుడు.
భావము :-
పద్మముల బురదలు తొలగించి, కలువల క్రొవ్వు అణచి, మదన తాపమును కొంత తగ్గించి, విరహులకు పట్టిన వెఱ్ఱిని ప్రకటితము చేసి, అంధకారాన్నంతా పరిమార్చి, చుక్కల తేజమును పోగొట్టి, మదమెక్కిన చకోరాల మదమును విడిపించి, అన్ని లోకాల నిద్రనూ మానిపించి, వేడి వెలుగును సకలదిశలందు వెదజల్లి, మునులు దేవతలు అర్ఘ్యములు ఇస్తుండగా తూర్పుకొండపై సంతోషంగా ఎర్రని కాంతులతో సూర్యుడు ఉదయించాడు.

3-125-వ.
ఇట్లు ప్రభాత సమయంబై యొప్పె నంతక మున్న తదీయ ప్రభాతకాల నిశ్చయాలోకన మనోరథుండై తుషారధరణీధరేంద్రుండు వంది మాగధ మంగళపాఠకాది జనంబులు కళ్యాణ వాద్యంబులతో నత్యంతశోభన తూర్యంబు లవార్యంబులై చెలంగ నాలించి ప్రాతస్స్నాన ప్రాణాయామ సంధ్యాది సముచిత కృత్యంబులు నిర్వర్తించి గృహదేవతా ప్రార్ధనంబు చేసి ధన కనక ధేను ధాన్యాది మహాదానంబుల ననేక భూసుర నికరంబులకు నుపచరించి. తదీయ మంగళాశీర్వాద ప్రమోదమానమానసుండై తదనంతరంబున.
భావము :-
ఈ విధంగా సూర్యోదయం కావడానికి ముందే కోరి హిమవంతుడు వందిమాగధుల పాఠక జనుల కళ్యాణ వాద్యముల ధ్వనులు విని; ఉదయపు స్నాన, ప్రాణాయామ, సంధ్యాది కార్యక్రమాలు ముగించి; కుల దేవతను ప్రార్ధించి; ధనము, బంగారము, ధేనువు, ధాన్యము మొదలైన గొప్ప దానములు అనేక బ్రాహ్మణులకు చేసి ఉపచారములు చేసి వారి ఆశీర్వాదములు పొంది ఆనందంగా యున్న సమయంలో.

3-126-మ.
పెద్దింటి యరుంగుమీఁదఁ గడఁకన్ ధాన్యంబు పైఁ బెండ్లిల
గ్నముపాధింపఁ బసిండి పేర్పున నభోగంగానదీ తోయముల్
ణం బోసి యలంకరించి ఘడియారంబొప్పఁ గట్టించి య
య్యరాచార్యునిచే మహామహిమతో ర్కప్రతాపంబునన్.

టీక :-
కడక = ప్రయత్నము; నభోగంగానది = ఆకాశగంగ; తోయము = నీరు; అర్క= సూర్య.
భావము :-
తమ ఇంటి ముందరి అరుగుమీద పూని ధాన్యం పోయించి, లగ్న నిర్ణయంగా ఆకాశగంగాజలమును ప్రోక్షణ చేయించి అలంకరించి, బృహస్పతిచేత సూర్య ప్రతాపంతో ముహూర్తము నిర్ణయించు యంత్రము పెట్టించెను..

3-127-వ.
ఇట్లు ఘడియారంబు వెట్టించి పరమేశ్వరుండు వేంచేయుచున్నాఁడు; ఎదుర్కొన పోవలయుఁదడవుసేయరాదని సంభ్రమానందంబున.
భావము :-
ఇలా ముహూర్తము నిర్ణయించు యంత్రము పెట్టించి పరమేశ్వరుడు వస్తున్నాడు. ఆలస్యం చేయరాదంటూ వేగంగా ఆనందంగా ఎదుర్కోలుకు బయలుదేరాడు.

3-128-సీ.
గంధమాదన మేరు కైలాస శైలాది
కులశైలభర్తలు గొలిచి నడువ
పుణ్యకాహళులును బుణ్యదుందుభులును
బుణ్యశంఖంబులు పొలచి మ్రోయ
మంగళపాఠక మాగధ వందిజ
నంబులు శుభకీర్తములు సేయ
దిసిపేరంటాండ్రు ళ్యాణములఁబాడ
రిజనంబులుతన్నుఁ లసి కొలువ

3-128.1-తే.
లితసామ్రాజ్యవైభవక్ష్మిమెఱసి
రఁగనంతంత మ్రొక్కుచు క్తితోడ
శైలముల కెల్ల రాజగు శైలవిభుఁడు
లమినేతెంచెఁ బరమేశు నెదురుకొనఁగ.

టీక :-
కాహళము = కొమ్ముబూర; కళ్యాణము = మంగళము.
భావము :-
గంధమాదన, మేరు, కైలాస పర్వతాలనాథులు కొలుస్తూ నడువగా, శుభకరమైన కొమ్ముబూరలూ, దుందుభులూ, శంఖములూ మ్రోగుచుండగా, మాగధిజనం మంగళపాఠాలు చెబుతుండగా, పేరంటాలంతా కూడి మంగళములు పాడుతుండగా, పరిజనాలు తనను ఎంతగానో కొలుస్తుండగా లలిత సామ్రాజ్య లక్ష్మి వైభవంతో పర్వతరాజు భక్తితో నమస్కరిస్తూ శివుని ఆహ్వానించడానికి ఎదురు వెళ్ళాడు.

3-129-వ.
ఇవ్విధంబున నెదురకొనం జనుదెంచి పంచాననుం డాదిగా నెల్ల వారలమీఁద సేసలు చల్లుచుఁ గరపల్లవంబులు మొగిడ్చి వినయంబునఁ బ్రణామంబులు చేసి “భక్తవత్సల! పరమేశ్వర! సర్వదేవతామయ! శంకరస్వామీ! మహేశ్వర! మహదేవ! దేవతాసార్వభౌమ! శరణ్యం” బని పలికినం; గనుగొని యల్లల్ల నవ్వుచు శ్రీవల్లభుం జూచి “చూచితే” యని పలుకుచు నమ్మహేశ్వరుండు తన్ను డాయ రమ్మని చేసన్న చేసినం గదిసి తుహినాచలేంద్రుండు.

టీక :-
సేసలు = అక్షతలు; డాయ = సమీపము; చేసన్న = చేతిసంజ్ఞ.
భావము :-
ఈ విధముగా ఎదుర్కొనడానికి వెళ్ళి శివుడు మొదలైనవారిమీద అక్షతలు చల్లుతూ చేతులు జోడించి వినయంతో నమస్కరించి పరమేశ్వరుని అనేక నామాలతో స్తుతించాడు.అదిచూసి మెల్లగా నవ్వుతూ విష్ణువును చూసి “చూశావా?’ అని పలికెను. ఆ మహేశ్వరుడు తనను దగ్గరగా రమ్మని చేతితో సంజ్ఞ చేయగా హిమవంతుడు వెళ్ళి.....

3-130-మ.
దీశాయ! నమో నమో నవసుధాసంకాశితాంగాయ! శ్రీ
నాథాయ! నమో నమో శుభకరానందాయ! వేదార్ధపా
వంద్యాయ! నమో నమో సురనదీరంగత్తరంగావళీ
కుటాగ్రాయ! నమో నమో మునిమనోమందార! సర్వేశ్వరా!

టీక :-
సంకాశము = సమానము; శ్రీనగము = శ్రీశైలము; పారగ = పారంగతుడు; సురనది = గంగ.
భావము :-
“లోకేశ్వరా! అమృతంతో సమానమైన చంద్రుని ధరించినవాడా! శ్రీశైల నాథా! మంగళకర ఆనందములనిచ్చేవాడా! వేదార్థములు తెలిసిన పండితులు నమస్కరించేవాడా! ఉత్తుంగ తరంగాలు కల దేవనదిని మకుటములో ఇముడ్చుకున్నవాడా! మునుల హృదయాలకు కల్పవృక్షము వంటివాడా! సర్వేశ్వరా! నమోనమో!” అంటూ పరమేశ్వరుణ్ణి హిమవంతుడు పరిపరివిధాలుగా స్తుతించాడు.

3-131-ఉ.
విదితతంత్ర మంత్రవాద వేదధర్మ మర్మముల్
వెకుఁ గాని నిన్నుఁ గాన లేవు యిట్టి నీకు స
మ్మముతోడఁ గన్నె నిచ్చి మామ నైతిఁ బుణ్యసం
లు గంటిఁ గీర్తిఁ గంటిఁ బంచవదన! శంకరా!

టీక :-
విదితము = తెలియబడిన; మర్మములు = రహస్యాలు; సమ్మదము = సంతోషము.
భావము :-
పంచవదనా! శంకరా! ఎంత బాగా తెలిసినా ఆ మంత్రాలు తంత్రాలు వేదాలు ధర్మ రహస్యాలు నిన్ను వెదకుతాయే కానీ నిన్ను చూడలేవు. అటువంటి నీకు సంతోషంతో కన్యనిచ్చి మామనై పుణ్యాన్ని సంపాదించుకున్నాను.”

3-132-వ.
అని వినుతించుచున్నగిరీశ్వరుం జూచి విరించి మొదలగు దేవతాబృందంబు లిట్లనిరి.

టీక :-
విరించి = బ్రహ్మ.
భావము :-
అని ప్రార్థిస్తున్న హిమవంతునితో బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు ఇలా అన్నారు.

3-133-ఆ.
రఁగ విహిత మైన నులను జేయంగఁ
బోవవలయునేని పోవు మిపుడు
దేవదేవుఁ డేగుదెంచుచు నున్నాఁడు
డవు సేయఁ దగదు ధారుణీధ్ర!”

టీక :-
పరగ = ఒప్పుగా; విహితము = చేయదగిన; తడవు = ఆలస్యము; ధారుణీద్ర = పర్వతరాజు.
భావము :-
ఇంకనూ చేయవలసిన పనులేమైనా ఉంటే ఇపుడు వెళ్ళు.దేవదేవుడు వస్తున్నాడు. ఆలస్యము చేయరాదు గిరీంద్రా.

3-134-వ.
అనిన విని “విహితకృత్యంబులు సర్వాయత్తంబు లై యున్నవి మహాత్ములార! మీతోడనే చంద్రశేఖరుఁ గొలిచి వచ్చెద” నని పలికిన నయ్యవసరంబున.

టీక :-
ఆయత్తము = సిద్ధము.
భావము :-
అనగా విని “మహాత్ములారా! కావలసిన పనులన్నీ సిద్ధముగా నున్నవి. మీతోబాటే నేను కూడా చంద్రశేఖరుని సేవిస్తూ వస్తాను అన్నాడు.” ఆ సమయంలో.

3-135-క.
గౌరీనాథుని పెండ్లికి
నీరేడుజగంబు లెల్ల నేతెంచుటయున్
భామునకు సైరింపక
తారాచలవల్లభుండు ద్దయుఁ గడఁకన్.

టీక :-
సైరించు = ఓర్చుకొను; తారాచలవల్లభుడు = హిమవంతుడు; తద్దయు = మిక్కిలి; కడక = ప్రయత్నము.
భావము :-
శివపార్వతుల పెండ్లికి పదునాలుగు లోకాలవారూ వచ్చినందున భారమునకు మిక్కిలి ప్రయత్నం చేసినా హిమవంతుడు సహింపలేకున్నాడు.

3-136-ఆ.
దేవదేవు పెండ్లి తెఱఁగొప్పనంతయుఁ
జూడఁ దలఁచి నిక్కి చూచె ననఁగ
క్షిణంబుదిక్కు ధారుణి యంతయుఁ
డలనొడ్డగెడవు గాఁగ నెగసె.

టీక :-
తెఱగు = విధము; నిక్కి = పైకెత్తి; గడ = సమూహము; గెడపు = కిందపడవేయు.
భావము :-
దేవదేవుని పెండ్లి ఎలా జరుగుతోందో చూడాలని పైకెత్తి చూసినట్లు దక్షిణ దిక్కు భాగమంతా సాగరం సరిహద్దుగా దక్షిణదిక్కు ఎగిసింది. భూమి ఒరుగుతోంది.

3-137-వ.
అంత నంతయుం బరికీంచి సకలలోకరక్షకుఁ డగు నారాయణ దేవుం డమ్మహాదేవున కిట్లనియె.

టీక :-
మహాదేవుడు = శివుడు.
భావము :-
అంతట అంతా గమనించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు.

3-138-శా.
స్వామీశంకర! కంకణోరగపతీ! సంవూజ్యబృందారకా!
కాధ్వంసక! సర్వలోకములు మీ ళ్యాణముం జూడ స
త్ప్రేమన్వచ్చుటఁ జేసి యుండఁగ మహావ్రేఁగై భరంబోర్వకీ
భూమీచక్రము గ్రుంగె నీవు సమతం బొందించి రక్షింపవే.”

టీక :-
ఉరగము = పాము; వ్రేగు = భారము.
భావము :-
”ప్రభూ! సుఖమును కలుగజేసే వాడా! సర్పరాజులను కంకణముగా ధరించినవాడా! పూజింపబడే దేవా! కాముని నీరుచేసినవాడా! లోకాలన్నీ మీ కళ్యాణము చూచుటకు ప్రేమగా వచ్చుటచే చాలా బరువై ఆ భారం మోయలేక భూమి ఈ ప్రక్కకు క్రుంగి పోతోంది. నీవు సమముగాచేసి రక్షించు.”