పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : శివుఁడు భూసమత్వంబునకై యగస్త్యుని దక్షిణదిక్కునకుఁ బంపుట.

3-139-వ.
అనవుడు సర్వేశ్వరుండు.

టీక :-
అనవుడు = అనేసరికి.
భావము :-
విష్ణువు అలా అనేసరికి శివుడు.

3-140-త.
మునీశ్వర పద్మజాసన ర్ణనీయుమహాత్మునిన్,
ధు లెల్లను లీలఁ ద్రావిన చండకోపునిఁ గోటి భా
స్కసమాన విభున్, ధరాసమత్త్వుఁ, గుంభజుఁ బంపె సు
స్ధితమై సమ మయ్యె దక్షిణదిక్కు ధారుణి చెచ్చెరన్.

టీక :-
పద్మజాసనుడు = బ్రహ్మ; శరధులు = సముద్రాలు; కుంభజుడు = కుంభమున జన్మించిన అగస్త్యుడు; చెచ్చెర = శీఘ్రముగ.
భావము :-
మునీశ్వరులలో శ్రేష్ఠుడు, బ్రహ్మచే కీర్తింపబడేవాడు, సముద్రాన్ని దోసిట పట్టి తాగినవాడు, తీప్ర కోపము కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో సమానమైనవాడు, భూమితో సమానమైన బలం కలవాడు యైన అగస్త్యుని దక్షిణ దిక్కుకు పంపగా వెంటనే భూమి స్థిరత్వాన్ని కలిగి సమమయ్యింది.

3-141-వ.
అంత.
భావము :-
అంతట

3-142-మ.
వెయన్ శంభుఁడు శైలరాజుపురికిన్ వేంచేసె నమ్మూకతో
లినవ్వేళఁ బురాంగనాజనము లానందంబుతో నందఱున్
జెలులుం దామును నుత్సవం బొదవఁగా శృంగారముం జేసి త
త్కధౌతాచలనాధుఁ జూడ మదిలోఁ గాంక్షించియోర్తోర్తుతోన్.

టీక :-
వెలయించు = ప్రకటించు; నలి = ఉత్సాహము; కలధౌత = వెండి.
భావము :-
శివుడు హిమవంతుని నగరానికి తన సమూహముతో వచ్చాడని తెలిసి ఉత్సాహంతో ఆ రోజు పురజనమంతా ఆనందంగా తమ సతులతో ఉత్సవానికి సరియగు అలంకరణలు చేసుకొని కైలాసనాథుని చూడాలనే కోరికతో ఒకరితోనొకరు…..