పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : శంకరుడు సప్తమహర్షులను పిలుచుట

3-17-మత్త.
వాసుకీకరకంకణుం డగు వామదేవుఁడు గౌరిఁ గై
లాశైలముమీఁద నుండి తలంచి యా చలికొండకున్
భాసురంబుగఁ బోయి యుంకువ బాలకిచ్చి నిజంబుగాఁ
జేసిరాఁగలవార లెవ్వరు శిష్టనైపుణమానసుల్.

టీక :-
వాసుకి = సర్పరాజు; వామదేవుడు = శివుడు; భాసురము = ప్రకాశించునది; ఉంకువ = అల్లుడు కన్య కొరకు మామకిచ్చు ద్రవ్యము; శిష్ట = ధీర, విశిష్ట.
భావము :-
సర్పరాజును చేతికి కంకణముగా కల శివుడు కైలాసములో గౌరిని తలుస్తూ సంభ్రమంగా కైలాసపర్మునకు సంబరంగా వెళ్ళెను. “బాలకోసం కన్యాశుల్కము యిచ్చి వివాహం నిశ్ఛయం చేసుకుని రాగల మంచి నిపుణులెవరా?” యని తలచెను.

3-18-క.
ము గలవారు నిపుణత
వారును బుద్ధినీతి లవారును ని
ర్మత గలవారు సంపద
వారు వివాహతతికిఁ గావలయు ధరన్.

టీక :-
తతి = సమయము.
భావము :-
వివాహ సమయానికి మంచి శక్తిశాలులు, నేర్పరులు, కార్యసాధకులు, నీతిమంతులు, సద్బుద్ది కలవారునూ కావలయును.

3-19-వ.
అంత నక్కడ మహేశ్వరుండు “మునీంద్రులారా! దేవకార్యంబుఁ దీర్ప నెల్లరు నిచ్చోటికివిచ్చేయుదురు గాక.”

టీక :-
ఎల్లరు = అందరూ.
భావము :-
అప్పుడు పరమేశ్వరుడు “మునీంద్రులారా! దేవకార్యము నెరవేర్చుటకు అందరూ ఇక్కడకు రండి.”

3-20-క.
నిసప్తర్షులఁ దలఁచినఁ
నుదెంచిరి తలపులోనఁ య్యన వారుం
నుదెంచి నిలిచి నిజకర
జంబులు మొగిచి మ్రొక్కి లనొప్పారన్.

టీక :-
నిజకరవనజములు = తామరలవంటి తమ చేతులు; మొగిచి = జోడించి; వలనొప్పారన్ = పద్దతిప్రకారము.
భావము :-
అని సప్తఋషులను శివుడు తలచుకోగానే వారు వెంటనే వచ్చి తామరపూలవంటి తమ చేతులు జోడించి నమస్కరించి పద్దతిగా.....

3-21-వ.
ఇట్లు స్తుతియింపఁ దొడంగిరి.

టీక :-
స్తుతించు = ప్రార్థించు.
భావము :-
ఆ సప్తఋషులు ఇలా శివుని ప్రార్థించసాగారు.

3-22-క.
“శంర! పాపభయంకర!
కంకాళకఫాలహస్త! గంగాధిపతీ!
ఓంకార మంత్రమందిర!
కంణభుజగాధినాథ! కారుణ్యనిధీ!

టీక :-
కంకాళకఫాలము = కపాలము; కారుణ్యనిధి = దయాసాగరా.
భావము :-
“శుభములు కలుగచేయువాడా! పాపాలపాలిటి భయంకరమైనవాడా! కపాలమును చేతధరించువాడా! గంగాదేవికి ప్రభువా! ఓంకారనాదానికి నిలయమైనవాడా! సర్పరాజును కంకణముగా ధరించిన ప్రభువా! దయాసాగరుడా!.

3-23-సీ.
రణార్థి కలధౌతశైలేంద్ర మందిర!
రణార్థి దిననాథచంద్రనయన!
రణార్థి పరమేశ! ర్వజ్ఞశేఖర!
రణార్థి గణనాథ క్రవర్తి!
రణార్థి దేవేంద్ర సంతతార్చితపాద!
రణార్థి నిర్మల చారువదన!
రణార్థి యోగీంద్ర సంతానభూజాత!
రణార్థి గజదైత్యర్మధార!

3-23.1-ఆ.
రద! దేవదేవ! వాసుదేవప్రియ!
కలలోకనాథ! శైలనాథ!
నకశైలచాప ఖట్వ! మూలస్తంభ!
దేవ! సత్ప్రతాప దివ్వరూప!

టీక :-
కలధౌత = వెండి; దిననాథుడు = సూర్యుడు; సర్వజ్ఞ = సమస్తమూ తెలిసిన; శేఖరుడు = శ్రేష్ఠుడు; గణనాథ = ప్రమదాధి గణముల నాయకుడు శివుడు; సంతత = ఎల్లప్పుడు; అర్చితము =- పూజింపబడిన; చారు = అందమైన; సంతానభూజాతము = కల్పవృక్షము; దైత్యుడు = అసురుడు; వరద = వరాలను ఇచ్చేవాడు; దేవదేవుడు = సకలదేవతలకు దేవుడైనవాడ; వాసుదేవుడు = విష్ణువు; కనకశైలము = మేరు పర్వతము; చాపము= ధనుస్సు; ఖట్వము = శివుని ఆయుధములలో ఒకటి, ఒకరకమైన దండము; సత్ప్రతాపుడు = మంచి ప్రతాపము కలవాడు.
భావము :-
కైలాస వాసా! సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! పరబ్రహ్మమా! సమస్తమూ తెలిసినవారిలో శ్రేష్ఠుడా! సర్వగణనాథులకూ అథిపతీ! ఇంద్రాదులు నిరంతరం కొలిచే పాదం కలవాడా! నిర్మలమైన అందమైన ముఖము కలవాడా! యోగీంద్రుల పాలిటి కల్పవృక్షమా! గజాసురుని చర్మమును ధరించేవాడా! వరాలను ఇచ్చేవాడా! నారాయణునకు ప్రియమైనవాడా! సకలలోకాథిపతీ! శ్రీశైలనాథా! మేరు పర్వతమను ధనుస్సు, ఖట్వము ఆయుధములుగా కలవాడా! ఆది కారణభూతుడవు కనుక మూలస్తంభమా! భగవంతుడా! మిక్కిలి ప్రతాపము, దివ్యమైన రూపము కలవాడా! నిన్ను శరణు కోరుతున్నాము.

3-24-క.
పంశరాంతకలోచన!
పంచానన! పంచరూప! భాసురకీ ర్తీ!
పంచేంద్రియాది నిర్జిత
పంచాక్షర దివ్యరూప! ప్రమథాధిపతీ!

టీక :-
పంచశరుడు = మన్మథుడు; పంచాననుడు = సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం,ఈశానం అనే ఐదు ముఖములు కలవాడైన శివుడు; పంచరూపుడు = గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే పంచభూతాలు స్వరూపమైన వాడైన శివుడు; పంచేంద్రియాలు = కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే ఐదు ఇంద్రియాలు; పంచాక్షరాలు = న మః శ్శి వా య అనే మంత్ర అక్షరాలు.
భావము :-
మన్మథుని మసిచేసిన నేత్రము కలవాడా! సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం,ఈశానం అనే పంచ ముఖములు కలవాడా! పంచభూతములు స్వరూపముగా కలవాడా! ప్రకాశవంతమైన కీర్తి కలవాడా! పంచేంద్రియాలను, అంతఃకరణాలను నిర్జించినవాడా! పంచాక్షర మంత్రరూపము కలవాడా! ప్రమథగణములకు అథిపతీ!.

3-25-శా.
వేదంబులకైన గూఢతరమై యేపారు నీ రూపమున్
దేవా!కంటిమి యెంత పుణ్యలమొకో దేవేశ! మీ రాత్మలో
భావింపం బనియేమి? మీ తలఁపు మా భాగ్యంబు సిద్ధించెనో
కైల్యాధిప! యానతిమ్ము కరుణన్ ర్జంబు సర్వేశ్వరా!”

టీక :-
ఏపారు = అతిశయించు; కైవల్యము = పరమపదము; కర్జము = కార్యము.
భావము :-
పరమశివా! దేవా! ఋక్, యజుర్, సామ, అధర్వణాది వేదాలకు కూడా తెలియని అతిశయించే నీ రూపాన్ని దర్శించాము. ఎంత పుణ్యాత్ములమో! దేవేశా! మీరు మనసులో మమ్మల్నెందుకు తలచారు? మా అదృష్టం పండి మీరు తలచుకున్నారు. పరమపదమునకు అథిపతీ! దయచేసి ఆ పనేమిటో ఆజ్ఞాపించండి.”