పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : శంకరునిదేవతలు స్తుతించుట.

3-233-వ.
కైలాసకంధరంబునకు నరిగి వార లందఱు నమ్మహేశ్వరుం గాంచి సాష్టాంగదండ ప్రణామంబులుగావించి వినయంబునఁ గరకమలంబులు నిటలతటంబులం గదియించి యిట్లని విన్నవించిరి.

టీక :-
కంధరము = పర్వతము; నిటలము = నుదురు; కదియించు = జోడించు.
భావము :-
కైలాసపర్వతమునకు వెళ్ళి వారంతా ఆ మహేశ్వరుని దర్శించి సాష్టాంగ నమస్కారము చేసి, వినయముతో చేతులు జోడించి నుదుటిపై ఆన్చి, ఇలా విన్నవించారు.

3-234-క.
“అధారు చంద్రశేఖర!
ధారు గజేంద్రదానవాంతకమూర్తీ!
ధారు భువననాయక!
ధా రొక విన్నపంబు నాలింపఁగదే.

టీక :-
అవధారు = దయచేసి వినండి; దానవుడు = రాక్షసుడు; భువనము = లోకము; ఆలించు = విను.
భావము :-
చంద్రశేఖరా! గజాసురుని అంతము చేసినవాడా! లోక నాయకా! పరమేశ్వరా! దయచేసి వినండి. ఒక విన్నపాన్ని వినండి.

3-235-చ.
ఱుఁగక మేము మందరమహీధ్రముఁ గవ్వము చేసి వాసుకిన్
నెయగఁ జేరు చేసి మఱి నీరధి నీరజనాభుఁ గూడి యం
మును ద్రచ్చుచో నొక యుగ్ర విషాగ్ని జనించె లోకముల్
రికొని కాల్పఁగాఁ దొడఁగె దాని నడించి మహేశ! కావవే.

టీక :-
మహీధ్రము = పర్వతము; ఎఱయు = నిండుగా; చేరు = తాడు; నీరధి = సముద్రము; నీరజనాభుడు = నాభియందు కమలము గల విష్ణువు ; త్రచ్చు = మధించు; ఉదగ్ర = భయంకరమైన; తఱికొను = ప్రవేశించు.
భావము :-
మహేశా! తెలియక మేము మందర పర్వతాన్ని కవ్వము చేసి వాసుకిని తాడుగా చేసి విష్ణువుతో కలసి పాలసముద్రాన్ని మధించసాగాము. ఒక భయంకరమైన విషాగ్ని పుట్టి లోకములలో ప్రవేశించి కాల్చుదొడంగినది. దానిని అణచి మమ్ములను రక్షింపవయ్యా.

3-236-ఉ.
కాజసంహరాయ! శశిఖండధరాయ! నమశ్శివాయ! కా
లా!హరాయ! భీషణబలాయ! కపాలధరాయ! దేవదే
వా!యమాంతకాయ! దృఢజ్ర పినాక త్రిశూలదండ హ
స్తా!మునీంద్ర యోగివరదాయ! సురాధిపతే! నమోస్తుతే.

టీక :-
కాయజుడు = మన్మథుడు; శశి = చంద్రుడు; నమః = నమస్కారము; హర = పాపములను హరించువాడు, శివుడు; భీషణ = భయంకరమైన; కపాలము = పుఱ్ఱె; దేవదేవుడు = దేవతలకు దేవుడు; పినాకము = శివుని విల్లు.
భావము :-
మన్మథ సంహారా! చంద్రశేఖరా! శుభములు కలుగజేసే శివా నమస్కారము. కాలస్వరూపుడా! పాపములను పోగొట్టేవాడా! భయంకరమైన బలము కలవాడా! పుఱ్ఱెను చేతియందు ధరించినవాడా! దేవతలకే దేవుడా! యముని నిగ్రహించినవాడా! గట్టిదైన వజ్రమువంటి విల్లు, త్రిశూలము, దండము ఆయుధములుగా కలిగినవాడా! మునీంద్రులకు,యోగులకు వరములు ఇచ్చేవాడా! దేవాధిపతీ! నీకు నమస్కారము.

3-237-ఉ.
తమంగళాయ! భుజగాధిప రమ్య కరాయ! రోహిణీ
నాక భాను వహ్ని నయనాయ! మహేశ్వర! బ్రహ్మ విష్ణు రూ
పా!పురాంతకాయ! పరిపంథి సురారి హరాయ! సాంఖ్య యో
గా!త్రిలోచనాయ! సుభగాయ! శివాయ! నమో! నమోస్తుతే.

టీక :-
ఆయత = దీర్ఘమైన, ఎక్కువైన; రోహిణీ నాయకుడు = చంద్రుడు; భానుడు = సూర్యుడు; వహ్ని = అగ్నిదేవుడు; మహేశ్వరుడు = గొప్ప ప్రభువు; పురాంతకాయ = త్రిపురములను దహించినవాడు; పరిపంధి = శత్రువులు; సాంఖ్య = సాంఖ్యము అను తత్వము; సుభగ = మంచి ఐశ్వర్యము కలవాడు.
భావము :-
అనంత శుభములు కలుగజేసేవాడా! సర్పరాజుచే అలంకరింపబడిన చేతులు కలవాడా! సూర్య, చంద్ర, అగ్నులు కన్నులుగా కలవాడా! గొప్ప ప్రభువా! బహ్మ, విష్ణు రూపములు నీవే అయినవాడా! త్రిపురములను అంతం చేసినవాడా! శత్రువులైన అసురులను నాశనం చేసేవాడా! సాంఖ్యతత్వయోగము తానైనవాడా! మూడు కన్నులు కలవాడా! అష్ఠైశ్వర్యములు కలవాడా! సుఖమును కలుగచేసే వాడా! నమస్కారము. నీకు నమస్కారము.

3-238-ఉ.
కాణకారణాయ! భుజర్వమదాంధక సంహరాయ! సం
సామహార్ణవజ్వలిత చండ మహాదహనాయ! దేవతా
స్ఫాకిరీటకూట మణిబంధుర పాదపయోరుహాయ! యోం
కామయాయ! భక్తజన ల్పకుజాయ! నమో! నమోస్తుతే.

టీక :-
మహార్ణవము = మహా సముద్రము; స్ఫార = అధికమైన; కుజము = చెట్టు.
భావము :-
కారణమనకే కారణమైనవాడా! భుజగర్వముతో మదించేవారిని సంహరించేవాడా! సంసారసాగరంలో మండే మంటలను దహించేవాడా! దేవతల తలలు వంచి నమస్కరించునపుడు మణులచే పొదగబడిన బంగారు కిరీటముల సమూహములు పాదములపై యుండేవాడా! ఓంకార మయమైనవాడా! భక్త జనులకు కల్పవృక్షము వంటివాడా! నమస్కారము. నీకు నమస్కారము.

3-239-మ.
తుసంవత్సర మాస పక్ష జనితారూఢాయ! నానాధ్వర
వ్రరూపాయ! రవీందు యజ్వ జల భూ వైశ్వానర వ్యోమ మా
రురూపాయ! శిఖండకధ్వజ యశోరూపాయ! యోగీశ్వర
స్తురూపాయ! నమో! నమో! శివ! నమో! సోమార్ధ చూడామణే!

టీక :-
అధ్వర = యజ్ఞము; యజ్వ = యాగకర్త; వైశ్వానరము = అగ్ని; వ్యోమ = ఆకాశము; మారుత = గాలి; శిఖండక = నెమలి పురి; సోమ = చంద్రుడు; చూడామణి = శిరోరత్నము .
భావము :-
ఋతువులు సంవత్సరములు, మాసములు, పక్షములు జనింపచేసేవాడా! బహువిధ యజ్ఞములు వ్రతముల రూపమును ధరించినవాడా! సూర్యుడు చంద్రుడు యాగకర్త నీరు భూమి అగ్ని ఆకాశము గాలి రూపములు తానైన వాడా! నెమలిపురిని ధ్వజముగా కలవాడని పేరు గాంచినవాడా! యోగీశ్వరులు స్తుతుల రూపము తానైన వాడా! చంద్రశేఖరా! శివా! నమస్కారము. నమస్కారము. నీకు నమస్కారము.

3-240-క.
వ్యక్తము లై నీ గుణములు
క్తులకుం గానవచ్చు వమతులకు న
వ్యక్తంబై చరియించును
క్తజనాధార! యభవ! యసంహారా!

టీక :-
వ్యక్తములు = తెలియబడినవి; భవము = సంసారము; అభవ = పుట్టుక లేనివాడు.
భావము :-
భక్త జనులకు ఆధారమైనవాడా! పుట్టుక లేనివాడా! భయమును పోగొట్టేవాడా! భక్తులకు నీ గుణములు తెలుస్తాయి. సంసారబుద్ధి మాత్రమే యున్నవారికి నీ గుణములు తెలియవు.

3-241-క.
భావించి జగము లన్నియుఁ
గావింపఁగ వాని నన్ని ఖండింపఁగ బ్ర
హ్మా విష్ణు మహేశ్వరు లన
నీవైతివి కాదె; దేవ! నిఖిలాధిపతీ!

టీక :-
భావించు = ఊహించు; నిఖిలము = సర్వము.
భావము :-
దేవా! సర్వాధిపతీ! ఊహించి జగములను సృష్టించడడానికి వాటిని నాశనము చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పేర్లతో యుండేది నీవే కదా!

3-242-క.
చింతింపరాదు నీ క్రియఁ
జింతింపఁగ రాదు నీవు చేసిన పనులం
జింతింపరాదు భక్తుల
చింత్యాచింత్యములు రుద్ర! శ్రీగౌరీశా!

టీక :-
చింతించు = ఆలోచించు; క్రియ = విధము; చింత్యము = చింతింపదగిన.
భావము :-
నీవు చేసే విధానము ఆలోచించలేము. నీవు చేసే పనులూ ఆలోచించలేము. భక్తులను ఆలోచింపచేసేదీ ఆలోచించకుండా చేసేదీ నీవే కదా!

3-243-క.
నిత్యము నీ గంభీరత
నిత్యము కరుణాబ్ధి యైన నీచిత్తంబున్
నిత్యము నీ కృత్యంబులు
నిత్యము నిను గొలువనిమ్ము నిర్మలమూర్తీ!

టీక :-
నిత్యము = ఎడతెగనిది, శాశ్వతమైనది; కృత్యము = పని.
భావము :-
నీ గాంభీర్యము, నీ కరుణా సముద్రమైన మనసు, నీ పనులు శాశ్వతమైనవి. నిర్మలమైనవాడా! ఎల్లప్పుడూ నిన్ను సేవించనిమ్ము.

3-244-క.
లక సమయము లాఱును
దువులు నాలుగును గూడి సంతతనియతిన్
వెకియుఁ బొడఁగన నేరవు
పడి నినుఁ జొగడవశమె ప్రమథాధిపతీ!

టీక :-
సమయములు = విద్యలు; పదపడి = ఇకపై.
భావము :-
షడ్విద్యలు, చతుర్వేదములూ కలసి వదలకండా నిరంతరమూ నియమముతో వెతికినా నీవు కనుగొనలేవు. ప్రమథనాయకుడా! శివా! అటువంటి నిన్ను ఇకపై పొగడగలమా?.

3-245-క.
నింగియు నేలయుఁ దానై
పొంగిన హాలాహలంబు బొరిమార్చి రహిన్
వెంలుల మమ్ముఁ గావుము
గంగారంగత్తరంగ లితజటాంగా!

టీక :-
పొరిమారుచు = చంపు; రహి = ఆనందము; వెంగలి = అవివేకి; రంగ = నాట్యస్థానము; కలిత = పొందబడిన, కలిగిన.
భావము :-
అలలతో నిండిన గంగతో ఒప్పుచున్న జటభాగం కలవాడా! భూమ్యాకాశములు తానై పొంగిన కాలకూట విషమును పోగొట్టి సంతోషముతో అవివేకులమైన మమ్ములను కాపాడుము.

3-246-వ.
అని మఱియు ననేక ప్రకారంబుల నుపేంద్ర దేవేంద్ర భారతీంద్ర ప్రముఖ లైన దేవగణంబులు ననన్యశరణంబు లై వేఁడినం గనుంగొని కరుణాయత్త చిత్తుండ నై యి ట్లంటి.

టీక :-
ఉపేంద్రుడు = విష్ణువు; భారతీంద్రుడు = బ్రహ్మదేవుడు.
భావము :-
అంటూ ఇంకనూ అనేక విధములుగా బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు దేవగణములు నీవే తప్ప వేరు దిక్కు లేదని ప్రార్ధింపగా చూసి కరుణాంతరంగుడనై ఇలా అన్నాను.

3-247-ఉ.
ప్పుడు మీరు నేఁ గలుగ నేల తలంక దిగంతరాళముల్
ప్పిన యీ హలాహలము ర్వ మడంచి ధరిత్రి మించి యే
నొప్పువహింతు నేఁడు దివిజోత్తములార! భయంబు మానుఁ డీ
చొప్పున నెన్నఁ డైన మిముఁ జోఁగిన యాపద బాపి కాచెదన్.”

టీక :-
కలుగు = ఉండు; తలంకు = భయము; దివిజోత్తములు = దేవతలు; చొప్పున = విధమున.
భావము :-
“నేనుండగా మీరెప్పుడూ బాధపడవద్దు. దిక్కులన్నిటినీ కప్పేసిన ఈ హాలాహలము గర్వము నణచి భూమి కంటె ఎక్కువ సహనముతో భరిస్తాను. దేవతలారా! భయము విడిచిపెట్టండి. ఈ విధంగా ఎప్పుడు మీకాపద కలిగినా పోగొట్టి కాపాడతాను.”